జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఏలూరులో ఓటు నమోదు చేయించుకోవడంపై గోదావరి జిల్లాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇలా జనసేనాని అడుగులు ఒక్కొక్కటిగా పడుతుండటంతో ప్రజల్లో ఊహించనిరీతిలో చర్చోపచర్చలు మొదలయ్యాయి. దీన్ని బట్టి చూస్తే రాబోవు ఎన్నికల్లో పవన్ జనసేన పార్టీ స్వతంత్రంగానే పోటీ చేస్తుందన్న విషయం వెల్లడౌతుంది. అయితే పవన్ ఏలూరు నుంచి పోటీ చేస్తాడా లేకా పాలకొల్లు నుండి పోటీ చేస్తాడా అన్న విషయంపై క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది.
కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగుతాడేమోనన్న భయం అటు వైకాపాను, ఇటు తెదేపాను పట్టి పీడిస్తుంది. అయితే ప్రధానంగా గోదావరి జిల్లాల్లోని ఆయా పార్టీ రాజకీయ నాయకులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకున్నారనే చెప్పాలి. ఎందుకంటే చిరంజీవి కంటే పవన్ కే ఎక్కువ ప్రజాబలం ఉందని ఆయా నాయకులకు అర్థమౌతుంది. అందుకనే చిరంజీవి గత ఎన్నికల్లో సొంత ఊరు పాలకొల్లు నుండి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. అలా పవన్ కళ్యాణ్ విషయంలో జరగదని, అంతో ఇంతో ప్రజల్లో పవన్ కళ్యాణ్ పై నమ్మకం ఉందని, ఆయనగానీ స్వతంత్రంగా జనసేన తరఫున ఎన్నికల్లో పాల్గొంటే ఆయన దాటికి తట్టుకోవడం కష్టమని కూడా ఆయా పార్టీలకు కలవరపెడుతున్న అంశం. కాగా కేవలం పవన్ కళ్యామ్ వల్లనే గత ఎన్నికల్లో తెదేపా ఆయా జిల్లాలలో మెజార్టీ సాధించిన విషయం తెలిసిందే. కాగా పవన్ మరో అడుగు ముందుకు వేసి ఏలూరు పరిసర ప్రాంతాల్లో నివాస భవనాన్ని కూడా ఏర్పాటు చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి పవన్ భారీ ప్లాన్ లో ఉన్నాడన్న మాట.