ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ భారత ప్రధాని నరేంద్ర మోడీపై ఎనలేని ప్రేమ కురిపిస్తున్నట్లుగా జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తుంది. రాజకీయ విశ్లేషకులు సైతం జగన్ అడుగులు భాజపై వైపు పడుతున్నాయా అన్నట్లు అనుమానిస్తున్నారు. కాగా ప్రస్తుతం వైకాపా అధినేతగా ఉన్న జగన్, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి జగన్ బయటకు వచ్చినా కూడా ఇంకా, కాంగ్రెస్ తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్నాడని వార్తలు అప్పట్లో బాగా వినిపించాయి.
కానీ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాజపాతో తెదేపా సంబంధాలను చెక్ పెట్టడానికే జగన్ భాజపా స్నేహాన్ని ఆశిస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం వైఎస్ జగన్ వేస్తున్న అడుగులు కూడా అలాంటి అనుమానాలనే రేకెత్తిస్తున్నాయి. వైకాపా ఎప్పుడూ ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వంటి నాయకుల జయంతిలను మాత్రమే జరుపుతుంది కానీ తాజాగా వైకాపా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని కూడా జరపడంతో వైకాపాపై ప్రజలకు అనుమానం కలుగుతుంది. అయితే సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఫ్రధాని మోడీకి. భాజపాకు అత్యంత కీలకమైన, ఇష్టమైన నేత. అందుకనే వల్లభాయ్ పటేల్ అంటేనే ముందుగా గుర్తొచ్చేది మోడీనే. అయితే తాజాగా జగన్ కూడా వల్లభాయ్ పటేల్ కు అభిమానిగా మారడంతో రాజకీయ చర్చల్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అందుచేతనే జగన్, భాజపాకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడా అన్న విషయంపై తెగ అనుమానాలు వస్తున్నాయి.