తమిళనాడు ప్రజలు ఆవేశం వచ్చినా, ఆనందం వచ్చినా అస్సలు తగ్గరు. ఇలాంటి పరిణామాలను మనం గతంలో వారి నుండి చాలా చూశాం. ముఖ్యంగా ఈ రాష్ట్రీయులు సినీ తారలంటే పడిచస్తారెందుకో. అసలు ఎవరినైనా అభిమానించడం తప్పు కాదుగానీ, మరీ వీరలెవల్లో అభిమానాన్ని ప్రదర్శిస్తుంటేనే కాస్త ఆలోచించాల్సి వస్తుంది.
ముఖ్యంగా తమిళనాడు గత చరిత్రను కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే, సినీ తారలకు వారు పాలాభిషేకాలు చేయడం, థియేటర్ల ముందు అతిగా రెచ్చిపోయి నానా బీభత్సం చేయడం వంటివి చూస్తే నిజంగా ఏంటో జాలేస్తూ ఉంటుంది. అసలు హారోయిన్లకు కూడా గుడి కట్టించడం అంటే వీరి వెర్రి ఎంత ముదిరి పాకాన పడితే గానీ అలాంటి ఆలోచనలు రావు జనాలకు.
తమిళనాట ఖుష్బూ, సిమ్రాన్, నమిత, నయనతార, హన్సిక తదితరులకు ఈ అరవ జనాలు అభిమానం ఎక్కువైపోయి గుళ్లు కట్టించి మరీ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఈ జాబితాలోకి కొత్తగా మరో హీరోయిన్ చేరిపోయింది. రెండేళ్ళుగా తమిళ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ మంచి ఊపు మీద ఉంది హీరోయిన్ కీర్తి సురేష్. అయికే సంవత్సరం మొదట్లో శివ కార్తికేయన్ సరసన కీర్తి సురేష్ నటించిన చిత్రం‘రజినీ మురుగన’. ఇది మామూలుగా హిట్ కాలేదు. బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఇక ఆ తర్వాత కీర్తి సురేష్.. ధనుష్ తో కలిసి చేసిన చిత్రం ‘తొడారి’ సరిగ్గా ఆడకపోయినా, తాజాగా శివ కార్తికేయన్ తో వచ్చిన చిత్రం ‘రెమో’ హిట్టయింది. ఇంకా కీర్తి సురేష్ ఇప్పుడు మరింత దూసుకుపోతూ సూపర్ స్టార్ విజయ్ తో ‘భైరవ’ చిత్రంలో చేస్తుంది. ఇంకా కీర్తి సురేష్ చేతినిండా మంచి క్రేజీ ప్రాజెక్ట్స్ చాలానే ఉన్నాయి. కాగా మంచి అందం, దానికి తోడు అభినయం ఉండటంతో కీర్తి సురేష్ తమిళనాట ప్రజలను బాగా ఆకర్షించి గుడి కట్టించుకొనే స్థాయికి అతి పిన్న వయస్సులోనే చేరిందంటే కీర్తి నిజంగా గ్రేటే.