కామెడీని నమ్ముకుని రాజేంద్రప్రసాద్ సుదీర్ఘ కెరీర్ కొనసాగించాడు. ఆయన వారసుడినంటూ వచ్చిన అల్లరి నరేష్ మాత్రం ఏలాగోలా యాభై చిత్రాల మార్క్ ను పూర్తిచేసినా ఫ్లాఫ్ ల నైరాశ్యంతో ఉన్నాడు. నరేష్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసి పట్టాలపైకి ఎక్కించిన తండ్రి (ఇవివి) లేని లోటు ఇప్పుడు తెలిసివస్తోంది. వృత్తిపరమైన క్రమశిక్షణ లేని కారణంగా అనేక మంది నిర్మాతలను దూరం చేసుకున్న నరేష్ ఇప్పుడు 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' అంటూ వస్తున్నాడు. ఈ కామెడీ హీరోని 'దెయ్యం' గట్టెక్కిస్తుందా? మళ్లీ పూర్వవైభవం తెస్తుందా? అని హాస్యప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిత్ర పరిశ్రమ ఎవరినైనా భరిస్తుంది కానీ క్రమశిక్ష లేకపోతె మాత్రం సమయం చూసి పక్కన పెట్టేస్తుంది. సరిగ్గా ఇదే పరిస్థితి నరేష్ కు వచ్చింది. ఇక 'దెయ్యం' సినిమాలు చాలా మంది హీరోలకి సక్సెస్ తెచ్చాయి. ఆ విధంగానే తనకు వస్తుందని నరేష్ నమ్మకంతో ఉన్నాడు. పైగా తనకు రెండు హిట్స్ ఇచ్చిన జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి దర్శకుడ కావడం వల్ల నమ్మకం మరింత పెరిగిందట.