Advertisementt

అంబానీకి, అమ్మవారికి మధ్య డీల్ జరిగిందా..?

Mon 31st Oct 2016 04:57 PM
mukesh ambani,lakshmi devi,deal,money,india richest business man  అంబానీకి, అమ్మవారికి మధ్య డీల్ జరిగిందా..?
అంబానీకి, అమ్మవారికి మధ్య డీల్ జరిగిందా..?
Advertisement
Ads by CJ

సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోతుంటాడు. అలా చేయడం ద్వారా తాను నిత్యచైత్యనంతో నడుస్తున్నానని అనుకుంటారనేమో తెలియదు గానీ, ఎప్పుడూ ఏదో ఒక హంగామా సృష్టిస్తూ ఉంటుంటాడు. చిన్న విషయాన్నే తనదైన శైలిలో మాట్లాడుతాడు. సెటైర్ వేస్తుంటాడు. అలా ఎందుకైతుందంటుంటాడు. అసలు ఒక్కోసారి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే విధంగా స్పందిస్తుంటాడు. కాగా దీపావళి పండుగను పురస్కరించుకొని వెరీ వెరీ అన్ హ్యాపీ దీపావళి అంటూ చెలరేగిపోయిన వర్మ తాజాగా ముఖేష్ అంబానీపై కన్నుపడింది. ముఖేష్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించడంతో పాటు ఆయన అంత డబ్పు సంపాదించడానికి గల కారణాన్ని అడిగి తెలుసుకున్నాడు.  

భారత దేశంలో ప్రముఖ వ్యాపార దిగ్గజం అయిన ముకేష్ అంబానీపై వర్మ సంచలనాత్మక కామెంట్ చేశాడు. అసలు లక్ష్మీ దేవి ముఖేష్ అంబానీపై ఎందుకు అంత ప్రేమ కురిపిస్తుంది అంటూ ట్వీట్ చేశాడు. అమ్మవారిని ప్రధానంగా లక్ష్మీ దేవిని ధనం కావాలని అందరూ పూజిస్తారు, కానీ అమ్మవారు మాత్రం అంబానీపై అమిత ప్రేమ కురిపిస్తుంది. అసలు లక్ష్మీ దేవి కూడా ఆయన్నే ఎందుకు ప్రేమిస్తున్నది అంటూ ఆయనపై తనదైన శైలిలో చిన్న సెటైర్ వేశాడు వర్మ. లక్ష్మీ దేవిని ఆయన ప్రత్యేకంగా ఏమన్నా పుజిస్తాడా? లేకపోతే వారి మధ్య ఇంకా ఏమైనా చెప్పరాని డీల్ జరిగిందా?  అంటూ సరదాగా ట్వీట్ చేశాడు వర్మ.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ