భారత దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ పరిపాలన ఎలా ఉంది అన్న విషయంపై ఎప్పటికప్పుడు సర్వేలు జరగుతూ ఉంటాయి. ఈ సర్వేలను బట్టి పరిపాలన ఏ విధంగా ఉంది, భారత దేశం ప్రపంచంతో ఎలా పరిగెడుతుంది, అలా ఏ విధంగా పోటీ పడుతుంది అన్నది నిర్ణయం తీసుసుకుంటారు. కాగా ఇలాంటి లెక్కల ఆధారంగా అభివృద్ధి విషయంలో ప్రపంచంలో దేశం పొందిన స్థానం ఏపాటిది, అలా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల పరిపాలన ఏ విధంగా ఉంది అనే విషయంపై కూడా స్పష్టత ఏర్పడుతుంది. ఇలాంటి వాటికోసం ప్రత్యేకంగా సర్వేలు నిర్వహిస్తుంటారు.
కాగా భారతదేశంలో మరింతగా ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ ఉన్న సీఎంలలో పరిపాలనను ప్రజలకు అతి దగ్గరగా చేర్చినందుకుగాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మొదటి స్థానం లభించిన విషయం అందరికీ తెలిసిందే. ఇలా కెసిఆర్ కు భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలలో సీయంలతో పోలుస్తూ మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడంతో ముఖ్యంగా తెదేపా జీర్ణించుకోలేకపోతుంది. ఇదే విషయంపై తెదీపా వర్గాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా కెసిఆర్ ఫాం హౌస్ సీయం అని, అతడు అందుకే పరిమితమౌతుంటాడని, అలాంటప్పుడు దేశంలోనే కెసిఆర్ ఫస్ట్ మార్కు సాధించడం ఎలా సాధ్యమని తెదేపా సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు అన్నాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్న సీఎం చంద్రబాబుకి ఎనిమిదో స్థానం కల్పించడం అంత సరిగ్గా తేల్చని లెక్కగా ఆయన కొట్టిపడేశాడు. ఇంకా గాలి మండిపడుతూ.. చంద్రబాబుకు ప్రజాధరణ తక్కువగా ఉందని వారు ఏ విధంగా చెప్తారని ఆయన ప్రశ్నించాడు. కాగా ప్రత్యేక హోదా కలిగి ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ చాలా వేగంగా డవలప్ కావడం ఖాయమని ఆయన వివరించాడు.