సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక హాట్ టాపిక్ తో చెలరేగిపోతుంటాడు. అలా నిరంతరం వంకర టింకర విషయాలను గుప్పిస్తూ సంచలనం రేపుతుంటాడు. అలా రేపుతూ కొందరితో విమర్శల పాలవుతూ, కొంతమందితో ప్రశంసింప బడుతూ ఎల్లప్పుడూ అలా నెటిజన్ల ఎమోషనాలిటీని పరీక్షిస్తుంటాడు. ఇలా నిత్యం ఏదో ఒక హంగామా సృష్టిస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. కాగా తెలుగు ప్రజలకు సంబంధించిన ప్రతి సన్నివేశంపైన సోషల్ మీడియా ద్వారా చెలరేగిపోతుంటాడు రామ్ గోపాల్ వర్మ. అయితే ఈరోజు దీపావళి సందర్భంగా అందరూ హ్యాపీ దీపావళి అంటూ సందేశాలను పంపుకుంటూ ఆనందంగా అభినందనలు తెలుపుకుంటుంటే, వర్మ గారు మాత్రం అన్ హ్యాపీ దీపావళి అంటూ ట్విట్టర్ ద్వారా సందేశాలను పంపుతూ పండగ పూట కూడా సంచలనం రేపుతున్నాడు. అసలు వర్మకు దీపావళి పండగ ఎందుకు నచ్చలేదంటే... పటాసులు పేల్చడం వల్ల విషపూరిత రసాయనాలు గాలిలోకి విడుదల చేస్తూ... వాతావరణం కలుషితం అవతుండటం కారణం అంట. అంతేకాకుండా భారీ శబ్దాలను పేల్చుతూ వయో వృద్ధులను, చిన్నారులను బయపెడుతున్న వారందరికీ అన్ హ్యాపీ దీపావళి అంటున్నాడీ వర్మ. ఇంకా ఆయన శైలిలో సెటైర్ కూడా పేల్చాడు. నరకాసురిడి గురించి సరిగ్గా తెలుసుకోకుండా ఆయన చావును సెలబ్రేట్ చేసుకునే వారికి అన్ హ్యాపీ దీపావళి అంటూ ట్వీటాడు దర్శకుడు వర్మ.