Advertisementt

ఇంతకీ ఈ 'చిన్నిరామయ్య' ఎవరు?

Sun 30th Oct 2016 09:31 PM
kalyan ram,isam movie,chinni ramayya movie,ramesh varma,other producer  ఇంతకీ ఈ 'చిన్నిరామయ్య' ఎవరు?
ఇంతకీ ఈ 'చిన్నిరామయ్య' ఎవరు?
Advertisement
Ads by CJ

నిర్మాతగా, హీరోగా 'ఇజం' చిత్రంతో డబ్బుల సంగతేమో గానీ మంచి ప్రశంసలు అయితే కళ్యాణ్‌రామ్‌కు లభించాయి.నిర్మాతగా ఆయన గట్స్‌ను, హీరోగా ఆయన నటనను అందరూ మెచ్చుకుంటున్నారు. కాగా ఈ చిత్రం తర్వాత కళ్యాణ్‌రామ్‌ బయటి నిర్మాతలతో కూడా చిత్రాలు చేస్తానని ప్రకటించాడు. ప్రస్తుతం ఆయన ఫ్లాప్‌ డైరెక్టర్‌ రమేష్‌వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. కథరీత్యా ఈ చిత్రానికి 'చిన్ని రామయ్య' అనే టైటిల్‌ అయితే యాప్ట్‌గా ఉంటుందని ఈ చిత్ర యూనిట్‌ భావిస్తోంది. మరి ఈ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారు? అనేది క్లారిటీ రాకపోయినా రమేష్‌వర్మ దర్శకత్వంలో కళ్యాణ్‌రామ్‌ 'చిన్నిరామయ్య' మాత్రం పక్కా అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. మరి రమేష్‌వర్మతో కళ్యాణ్‌రామ్‌ సినిమా ఒప్పుకోవడం చూస్తుంటే ఇంతా చేసి చివరకు ఈ దర్శకుడిని ఎంచుకున్నాడు? ఏందబ్బా? అని ఆయన అభిమానులు, సినీ వర్గాలు పెదవి విరుస్తున్నాయి.