Advertisementt

కొడుకులే తన ఆస్తులన్న హరికృష్ణ..!

Sun 30th Oct 2016 07:46 PM
harikrishna,sons,hit movies,jr ntr,kalyan ram,gifts  కొడుకులే తన ఆస్తులన్న హరికృష్ణ..!
కొడుకులే తన ఆస్తులన్న హరికృష్ణ..!
Advertisement
Ads by CJ

స్వర్గీయ నందమూరి తారక రామారావు కుమారుడు నందమూరి హరికృష్ణ నోరు తెరిచి ఏం మాట్లాడినా అది వివాదాస్పదం అవుతుంది. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో ప్రజల నోళ్ళలో నానుతుండటం అంటే ఆయనకు ఇష్టం. ఈ మధ్య నందమూరి హరికృష్ణ మాట అస్సలు వినపడటం లేదు ఏంటో. ఉన్నట్టుండి హరికృష్ణ విషయంలో కొత్త కొత్త న్యూస్ చక్కర్లు కొడుతుంది. సొంతగా కొడుకుతో కలిసి  కొత్త పార్టీ పెడుతున్నారంటూ ఆయన మీద రకరకాల వార్తలు వచ్చాయి కానీ ఈ విషయంపై హరికృష్ణ మాత్రం తన స్పందనను ఎక్కడా తెలియజేయలేదు. ఈ మధ్య తాజాగా  తన కుమారుడు కల్యాణ్ రామ్ చేసిన చిత్రం ‘ఇజం’ విజయవంతంగా నడుస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఓ టెలివిజన్ చానల్ కు హరికృష్ణ ప్రత్యేకంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నటించిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ అయిందని తర్వాత  తన మరో కుమారుడు కల్యాణ్ రామ్ ఇష్టపడి చేసిన ‘ఇజం’ ప్రేక్షకులను మెప్పించిందంటూ వెల్లడించాడు. కాగా దీని వెనుక దర్శకుడు పూరీ జగన్నాధ్ కృషి ఎంతో ఉందని కూడా హరికృష్ణ వివరించాడు. చివరగా నందమూరి హరికృష్ణ మాట్లాడుతూ.. ఒక తండ్రిగా తన ఇద్దరు కుమారుల నుంచి ఇంత మంచి గిఫ్ట్స్ రావడం తనకు చాలా ఆనందాన్నిచ్చాయని ఆయన వివరించాడు.

 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ