Advertisementt

ఒక్క లుక్ తో రాయుడు రూమర్స్ కి చెక్!

Sun 30th Oct 2016 06:07 PM
katamarayudu,pawan kalyan,power star,shruti haasan,deewali look,katamarayudu deewali poster  ఒక్క లుక్ తో రాయుడు రూమర్స్ కి చెక్!
ఒక్క లుక్ తో రాయుడు రూమర్స్ కి చెక్!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ అన్ని రూమర్స్ కి చెక్ పెట్టేసాడు. కాటమరాయుడు సినిమా ఫస్ట్ లుక్ తో ఈ దీపావళి పండగకి ఫ్యాన్స్ ని పండగ చేసుకోమని పవన్, శృతి హాసన్ తో కలిసి  వచ్చేసాడు. ఇప్పటి వరకు కాటమరాయుడు సినిమా పై అనేక రూమర్స్ షికార్లు చేశాయి. ఈ చిత్రం పై  పవన్ అసంతృప్తిగా వున్నాడని, డైరెక్టర్ డాలి పై కోపం గా వున్నాడని అబ్బో ఒకటేమిటి చాలా రూమర్స్ ప్రచారం లోకి వచ్చాయి. అసలు పవన్ కాటమరాయుడు సెట్స్ నుండి వెళ్లిపోయాడనే ప్రచారము జరిగింది. ఇంకా ఈ సినిమాలో పవన్ కి జోడిగా చేస్తున్న శృతి హాసన్ కూడా డేట్స్ ప్రాబ్లెమ్ లో పడిందని.... ఈ సినిమా చాలా లేట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయని ప్రచారం జరిగాయి. కానీ పవన్ మాత్రం రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని... అందుకే ఈ సినిమాని తొందరగా కంప్లీట్ చెయ్యడానికి తొందరపడుతున్నాడు. అందుకే ఫ్యాన్స్ కి దీపావళి పండగతో పాటు తన సినిమా ఫస్ట్ లుక్ తో సెలెబ్రేషన్స్ చేసుకోమని డీసెంట్ లుక్ తో వచ్చి అలరించాడు. ఇక ఈ ఫస్ట్ లుక్ లో పవన్, శృతి హాసన్ కలిసి దీపాలు పెడుతూ దీపావళిని సెలెబ్రేట్ చేసుకుంటున్నట్లు చూపించారు. ఈ లుక్ తో ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించే రీతిలో ఉంటుందని అందరూ ఒక అంచనాకి వచ్చేసారు. ఏంతో అందంగా ఈ పోస్టర్ లో పవన్, శృతి హాసన్ కనిపిస్తున్నారు. దీపావళి కి అసలైన లుక్, అసలైన సంబరం అనేలా లుక్ ఉండటంతో పవన్ ఫ్యాన్స్.. దీవాళి ముందే వచ్చేసింది అన్నంత ఆనందంలో వున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ