Advertisementt

బాలీవుడ్ లో శృతికి మరో ఆఫర్..!

Sat 29th Oct 2016 05:51 PM
shruti haasan,bollywood,tony dsouza,behen hogi teri  బాలీవుడ్ లో శృతికి మరో ఆఫర్..!
బాలీవుడ్ లో శృతికి మరో ఆఫర్..!
Advertisement
Ads by CJ

మోస్ట్ ట్యాలెంటెడ్ గా పేరుపొందిన సొగసైన చెన్నై బ్యూటీ శృతి హాసన్. కానీ టాలీవుడ్, కోలీవుడ్ లో వరుస ఆఫర్లతో అద్భుతమైన విజయాలు సాధిస్తున్న ఈ భామకు బాలీవుడ్ లోనూ మంచి ఆఫర్లు వస్తున్నాయి.  తమిళ, తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న ఈ భామకు ఉన్నట్టుండి బాలీవుడ్ మరిన్ని అవకాశాలు అందిస్తుంది.  అలా అన్ని పరిశ్రమలలో అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఆధిపత్యంతో కొనసాగుతూ తనదైన శైలిలో నటనను పండిస్తుంది శృతి హాసన్. 

కాగా ప్రస్తుతం తమిళ్ లో తండ్రి కమల్ హాసన్ తో కలిసి శభాష్ నాయుడులో శృతి నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రమైన కాటమరాయుడు చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో బాలీవుడ్ నుంచి కూడా శృతికి ఓ మంచి ఆఫర్ వచ్చింది. అజార్ మూవీ ప్రొడ్యూసర్ టోనీ డిసౌజా, 'బెహెన్ హోగీ తేరీ' అనే చిత్రం తీయనున్నాడు. కాగా ఈ చిత్రంలో షాహిద్ ఫేమ్ రాజ్ కుమార్ రావ్ హీరోగా నటించనున్నాడు. అయితే తను చేసుకోబోయే భార్య కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉండే ఓ యువకుడి కథ ప్రధానాంశంగా ఈ చిత్రం తెరకెక్కనుంది.  ఈ చిత్రంలో శృతి గడుసైన  పాత్రలో నటించనుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ