నిజాయితీ పరుడైన అధికారిగా ఎన్నో పదవులు అనుభవించిన ఏకేఖాన్ కు కెసిఆర్ బంపర్ ఆఫర్ ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. ఒకవిధంగా చెప్పాలంటే ఏకేఖాన్ అక్రమ సంపాదన పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. ఏసీబీ అధికారిగా ఏకేఖాన్ కు మంచి పేరుంది. ప్రధానంగా చంద్రబాబు వారి బృందం 'ఓటుకు నోటు' కేసులో అడ్డంగా బుక్కయిపోవడానికి ఈ ఏసీబీ బాస్ ఏకె ఖాన్ కారణమన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే అక్రమంగా సంపాందించే కొంతమంది ఎమ్మెల్యేలకు ఆయనంటే మంట. ఏ పనులూ చేసుకోనివ్వకుండా, తమ పనులకు నిరంతరం అడ్డు తగలడమే కాకుండా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే భారీ నష్టాన్ని కలిగించే పోలీస్ శక్తిగా ఆయన్ను అందరూ భావిస్తారు. అందుకు ప్రతిఫలంగా తెలంగాణ ప్రభుత్వం ఆయనకు గట్టి నజరానానే ఇచ్చేందుకు సిద్ధపడినట్లు తెలుస్తుంది. ఆయన చేసిన సేవలకు గాను, రిటైర్మెంట్ తర్వాత ఏదో ఒక మంచి పదవిని ఇచ్చేందుకు ప్రయత్నాలు జరిపుతున్నట్లు తెలుస్తుంది.
అయితే తెరాస తరపున ఏకె ఖాన్‌ను రాజ్యసభకు పంపాలని సీఎం డిసైడ్ అయినట్లు కూడా వార్తలు అందుతున్నాయి. ఒకవేళ అలాంటిది కష్టమనుకుంటే తెలంగాణ శాసనమండలికి నామినేట్ చేసే ఆలోచనలో కూడా కెసిఆర్ ప్రభుత్వం ఉందన్న విషయం కూడా చెక్కర్లు కొడుతుంది. ఏది ఏమైనప్పటికీ తనకు ఎంతో సాయపడ్డ ఏసీబీ బాస్ ఏకేఖాన్ రుణం ఈ విధంగా తీర్చుకునేందుకు కెసిఆర్ ఎంతో కృతనిశ్చయంతో ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది.