Advertisement

తెదేపా ఆంధ్రా పార్టీ ఎట్లయితది.?

Sat 29th Oct 2016 05:15 PM
reventh reddy,ttdp leader revanth reddy  తెదేపా ఆంధ్రా పార్టీ ఎట్లయితది.?
తెదేపా ఆంధ్రా పార్టీ ఎట్లయితది.?
Advertisement

తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శాసనసభాపక్ష నేత అనుముల రేవంత్ రెడ్డి పార్టీ ముఖ్యనేతలను ఉద్దేశించి చాలా ఆవేశంగా ప్రసంగించాడు. తన సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్ లో  నిర్వహించిన పార్టీ ముఖ్యనాయకుల సమావేశంలో రేవంత్  రెడ్డి మాట్లాడుతూ  కష్టాలు ఉన్నాయని దిగాలు పడి ఇంట్లో కూర్చుంటే లాభం లేదన్నారు. కష్టాలు ఉన్నప్పుడు కలబడి నిలబడిన వాడే మొనగాడని పేర్కొంటూ టీడీపీ కార్యకర్తలు అలాంటి మొనగాళ్లేనని మరో సారి మనం నిరూపించుకోవాలని వెల్లడించాడు. ఎవరైన తెలుగుదేశం పార్టీని ఆంధ్రా  పార్టీ అని విమర్శిస్తే అలాంటి వారిని చేతితో కాకుండా ఎడమ కాలి చెప్పుతో కొట్టి సమాధానం చెప్పాలని పార్టీ నేతలను ఉద్దేశించి రేవంత్  ఆవేశంగా మాట్లాడాడు.

ఇదివరకు తెదేపా కాంగ్రెస్ పార్టీలకు ఓట్లు వేశాం , ఈ ఒక్కసారికి తెలంగాణకు ఓట్లు వేద్దామని తెలంగాణ కోసం పోరాడిన పార్టీకి ఓటు వేసి చూస్తామని టీఆర్ ఎస్ కు  ఓటు వేసి గెలిపించిన పాపానికి రాష్ట్రం మొత్తాన్ని కేసీఆర్ భ్రష్టు పట్టిస్తున్నాడని రేవంత్ రెడ్డి తీవ్రంగా ఆరోపణలు చేశాడు. అయితే తెలంగాణ రాష్టం వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటినా సరే ఇంతవరకు పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లుకానీ,  మూడెకరాల భూమిగానీ,  విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ గానీ,  గిరిజన.  మైనార్టీ వర్గాల వారికి 12% రిజర్వేషన్లుకానీ,  ఇంటికో ఉద్యోగంకానీ ఏమన్నా వచ్చాయా అంటూ రేవంత్ రెడ్డి ఆరోపించాడు. నీళ్లు, నిధులు,  నియామకాలు అంటూ మాయ చేస్తున్న కేసీఆర్ ఇప్పటి వరకు ఒక్క ఎకరాకైనా  కనీసం అదనంగా నీళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. పాలమూరు జిల్లాలో నిర్మాణంలో ఉన్న కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు ఇప్పటి వరకు రూ. 9వేల కోట్ల దాకా ఖర్చు అయితే అందులో టీఆర్ ఎస్ పెట్టింది కేవలం 390 కోట్లు మాత్రమేనని ఆయన గుర్తు చేశాడు. 

ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీని ఆంధ్ర పార్టీ అంటే వారిని చేత్తో కొట్టకూడదని ఎందుకంటే చేత్తో కొడితే మరిచిపోతారు కాబట్టి అలాంటి వారిని ఎడమ కాలి రబ్బరు చెప్పుతో కొట్టి బుద్ది చెప్పాలని రేవంత్ పిలుపునిచ్చాడు. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డమీద  అని హైదరాబాద్ పాత ఎమ్మెల్యే క్వార్టర్స్లోనే అని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గుర్తు చేశాడు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసింది కూడా తెలుగుదేశం పార్టీయేనని ఆయన వెల్లడించాడు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement