ప్రస్తుతం మురుగదాస్- మహేష్‌బాబుల కాంబినేషన్‌లో తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషాచిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. మొదట్లో ఈ చిత్రంలో ఓ ఫైట్‌కు రూ.30 కోట్లు కేటాయించాలని భావించినప్పటికీ మహేష్ సలహాపై ఈ ఫైట్ సీన్ విషయంలో నిర్మాతలు వెనక్కి తగ్గారు. కాగా ఈ చిత్రంలో మహేష్‌బాబు ఓ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. క్రైమ్, యాక్షన్ తరహా చిత్రం కావడంతో ఈ చిత్రానికి 'ఏజెంట్ శివ' అనే పేరు పెడతారనే వార్తలు వచ్చాయి. కానీ ఈ చిత్రం టైటిల్ అది కాదని అఫీషియల్ సమాచారం. ఇదేదో డబ్బింగ్ టైటిల్‌లా ఉందనే అభిప్రాయం రావడంతో మహేష్ ఫ్యాన్స్ కూడా ఈ టైటిల్ బాగా లేదని సూచిస్తున్నారు. ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఏమిటంటే... ఈ చిత్రం తమిళ వెర్షన్‌కు అచ్చమైన తమిళ టైటిల్‌ను పెడితే అక్కడి ప్రభుత్వం భాషా జీనోద్దరణలో భాగంగా పలు అంశాలలో ఈ చిత్రానికి ఎన్నో సబ్సిడీలను ఇస్తుంది. అలాగని ఒకే టైటిల్‌ను తెలుగు, తమిళ భాషలకు సూట్ అయ్యేలా చేయడానికే శంకర్ వంటి దర్శకుడు కూడా తన 'రోబో' చిత్రానికి తమిళంలో 'యంతిరన్' అనే టైటిల్ పెట్టాడు. మురుగదాస్ కూడా తన 'తుపాకి' చిత్రాన్ని తమిళ, తెలుగు భాషలు రెండింటికి ఒకే టైటిల్ కలిసొచ్చేలా టైటిల్ ను ఫిక్స్ చేశాడు. మరి ఈ విషయంలో మురుగదాస్, మహేష్‌లు తెలుగు, తమిళ భాషల్లో ఒకే టైటిల్‌ను కలిసొచ్చేలా పెడతారా? లేక రెండు వెర్షన్‌లకు రెండు డిఫరెంట్ టైటిల్స్‌ను పెడతారా? అనే విషయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాగా క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ కథాంశం కావడంతో ఈ చిత్రంలోని ఓ ఫైట్‌కు అరల్ అరసు, పీటర్‌హెయిన్స్‌లను తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఈ ఫైట్ కోసం మరో ఫైట్ మాస్టర్ రవివర్మను కూడా తీసుకున్నారని సమాచారం. మరి ఈ ముగ్గురు కలిసి ప్లాన్ చేస్తే ఆ ఫైట్ హాలీవుడ్ రేంజ్‌ను తప్పకుండా రీచ్ అవుతుంది. ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులందరూ మహేష్‌ను అభినందించాలి!