అదేంటో గానీ 'జబర్దస్త్' ప్రోగ్రాంతో హాట్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న అనసూయకు చాలా కాలం కిందట ఏకంగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్- త్రివిక్రమ్ సినిమా 'అత్తారింటికి దారేది' చిత్రంలో ఓ ఐటం సాంగ్‌కు ఆఫర్ వచ్చింది. కానీ ఆ అవకాశానికి అనసూయ నో చెప్పింది. పోనీలే ఐటం సాంగ్స్ చేసే ఉద్దేశ్యం లేదేమో.. ఏదో హీరోయిన్ పాత్రలకైతేనే ఓకే అంటుందేమో అని అందరూ భావించారు లేదా పవన్‌ను సీనియర్ స్టార్ అనుకుంటుందేమో.... కుర్ర హీరోలతోనే చేస్తుందేమో అని మరికొందరు భావించారు. కానీ 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రంతో ఆమె వెండితెరపై ప్రత్యక్షమైంది. మరి పవన్ ఏమీ నాగార్జున కంటే సీనియర్ స్టార్ కాదు కదా...! అని పవన్ అభిమానులు కస్సుమన్నారు. ఇక 'క్షణం' చిత్రంలో ఎవ్వరూ ఊహించనట్లు పవర్‌ఫుల్ పాత్రను చేసింది. ఇక ఈమె ఐటంసాంగ్స్ చేయదేమో అని మరికొందరు భావించారు. కానీ ఆమె ప్రస్తుతం మామ పవన్‌ను సైడ్ పెట్టి అల్లుడు సాయిధరమ్‌తేజ్‌తో ఐటం సాంగ్‌లో చిందులేయడానికి ఒప్పుకుంది. ఇంతకీ అసలు అనసూయ మనసులో పవన్ స్దానం ఏమిటి? అనేది ఎవ్వరికీ అర్ధంకాని ఫజిల్‌గా మారింది.