మన దక్షిణాది చిత్రాలు ఈమధ్య 'బాహుబలి' ద్వారా బాలీవుడ్‌లో వంద కోట్ల మార్క్‌ను దాటాయి. దీంతో త్వరలో మహేష్, మురుగదాస్‌ల కాంబినేషన్‌లో వచ్చే ఒక ఫైట్‌కు ఏకంగా రూ.30 కోట్లు పెట్టాలని భావించారు. ఆ సంగతేమీ కానీ ఇప్పుడు ప్రభాస్ 'బాహుబలి2' తర్వాత నటించే సుజీత్ చిత్రం కోసం కూడా ఓ ఫైట్‌కు రూ.30కోట్లు ఖర్చుచేయాలని యువి క్రియేషన్స్ అధినేతలు ఫిక్స్ అయ్యారు. దానికి ప్రభాస్ సైతం ఆనందంగా ఒప్పుకున్నాడట. మరి ఈ ఫైట్‌ను హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కించాలని సుజీత్ భావిస్తున్నాడని సమాచారం. ఇప్పుడు అందరూ పొదుపు మంత్రంతో ముందుకు వెళ్తుంటే.. మన నిర్మాతలకు మాత్రం బాలీవుడ్ అనే మాట వింటే పూనకం వస్తోంది. ఇక అంత భారీ బడ్జెట్‌ను తన చిత్రంలోని ఓ ఫైట్‌కు ఖర్చు చేయాలని భావించిన దర్శకనిర్మాతలు ఓకే చెప్పిన తర్వాత హీరోకి కూడా అది ఆనందకరమైన అంశమే కదా...! అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా ఈ ఫైట్ సినిమాలో అత్యంత కీలకంగా నిలిచే స్కై ఫైట్ అని సమాచారం. నేల మీద కాదు.. నీళ్ల మీద కాదు.. ఇప్పుడు స్కై ఫైట్‌గా దీనిని తెరకెక్కించనున్నారని సమాచారం. ఇందుకోసం స్పెషల్‌గా ఈ ఫైట్‌ను పిక్చరైజ్ చేయడానికి ఈ చిత్ర దర్శకనిర్మాతలు హాలీవుడ్ నుండి ఇందులో నిష్ణాతులైన, స్కైఫైట్‌లో అత్యంత నైపుణ్యం ఉన్న ఫైట్ కంపోజర్స్‌ను ఇండియాకు రప్పించనున్నారు. ఎలాగూ ఈ ఫైట్‌ను ప్రభాస్ డూప్‌తోనే చిత్రీకరిస్తారు కదా! దీని కోసం అంత వ్యయప్రయాసలు ఎందుకని సినీ విశ్లేషకులు విమర్శలు సంధిస్తున్నారు.