ఈ మధ్య జరిగిన కర్నూలు యువభేరి సభా సాక్షిగా జగన్ మోహన్ రెడ్డి ఉన్న ఆ కొంతమంది ఎంపీలనూ దూరం చేసుకొనేలా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం ప్రకటించాల్సిన ప్రత్యేక హోదా కోసం తమ ఎంపీలతో రాజీనామా సైతం చేయిస్తానని, అసలు రాబోవు ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశం ప్రధాన ఎజెండాలో పెడతామని వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ విషయం సంచలనాంశంగా మారి పార్టీలో ముసలం రాజుకుంది. కనీసం పార్టీ అధినేత ఎంపీలతో కూడా చర్చించకుండా అలా సభాముఖంగా ఎంపీల రాజీనామా అంశం ప్రకటించడం ఏంటి అంటూ వైకాపా ఎంపీలు కొంతమంది చిర్రుబుర్రులాడుతున్నారని టాక్. జగన్ మాట్లాడుతూ ప్రత్యేక హోదాకోసం తాము దశలవారీగా పోరాటం చేస్తామని, చివరి దశలో ఎంపీలతో రాజీనామా కూడా చేయించడానికి ఏమాత్రం వెనుకాడబోమని వివరించాడు. ఆ విషయంపై సొంతపార్టీ ఎంపీల నుంచి జగన్ కు ఎదురుదెబ్బ తగులుతుంది.
అయితే చాలా కాలం నుండి జగన్ దాడికి తట్టుకోలేకో మరి, తేదేపా దాడికి బుసతిరక్కో నెల్లూరు జిల్లా ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి భాజపాలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. అందుకోసం ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకే చెందిన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుతో చర్చలు కూడా జరిపినట్లు బయటకు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ మేకపాటి భాజపాలో చేరే నిర్ణయాన్ని విరమించుకున్నాడు. దాంతో ఆయన ఆ సమయంలో జగన్ తీరులో మార్పు రావలసిన అవసరం ఎంతైనా ఉందని చురకలంటించి పార్టీలో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నాడు.
ఇప్పుడు మరోసారి మేకపాటి, జగన్ కి షాక్ ఇచ్చేలా వ్యాఖ్యలు చేశాడు. కనీసం పార్టీలో ఉంటున్న ఎంపీలతో కూడా చర్చించకుండా జగన్ అలా ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసే అంశంపై ఎలా ప్రకటిస్తాడంటూ చురకలంటించాడు. కాగా మేకపాటి మాట్లాడుతూ.. రాజీనామా చేసేందుకు సిద్ధంగానే ఉన్నాం కానీ జగన్ ఈ విషయం తమతో చర్చించలేదని మేకపాటి అనడం గమనార్హం. మేకపాటి ఉన్నట్టుండి ఇలా మాట్లాడటంతో నెల్లూరు జిల్లా రాజకీయాలు మరోమారు చర్చనీయాంశంగా మారాయి. మరి ఈ సారి మేకపాటి ఏవిధమైన స్టెప్ తీసుకుంటాడో వేచి చూడాలి. ఇలాంటి ప్రకటల ద్వారా జగన్ నెల్లూరు జిల్లా నేతలకు కూడా దూరం కాబోతున్నాడా అంటూ వార్తలు సంచరిస్తున్నాయి.