ఇటీవల వరకు రాజకీయాల్లో బిజీగా గడిపిన తర్వాత పవన్ 'సర్దార్ గబ్బర్‌సింగ్' బ్రేక్‌ను ఆ విధంగా ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు ఆయన తాజాగా శరత్‌మరార్ నిర్మాణంలో డాలీ దర్శకునిగా 'కాటమరాయుడు' చిత్రంలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఉగాది కానుకగా మార్చి 29న విడుదల చేస్తామని కూడా ప్రకటించారు. కాగా ఈ చిత్రం ఇంకా సెట్స్‌పైకి వెళ్లకుండానే ఎ.యం.రత్నం నిర్మాతగా... పవన్ తమిళ దర్శకుడు నీసన్ దర్శకత్వంలో 'వేదాళం' రీమేక్‌కు కూడా క్లాప్ కొట్టాడు. గతంలో ఎ.యం.రత్నం పవన్‌కు ఓ సూపర్‌హిట్‌ను, మరో ఫ్లాప్‌ను ఇచ్చాడు. 'ఖుషీ'తో హిట్‌నిచ్చి 'బంగారం'తో ఫ్లాప్‌నిచ్చాడు. అయినా పవన్ రత్నం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయనకు ఓ చిత్రం చేయాలనే సంకల్పంతోనే ఆయనతో 'వేదాళం' రీమేక్‌కు కమిట్ అయినట్లుగా చెబుతున్నారు. తాజాగా పవన్, త్రివిక్రమ్ సినిమాను కూడా ట్రాక్ ఎక్కించడానికి రెడీ అయ్యాడు. త్రివిక్రమ్ దర్శకునిగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్‌పై ఓ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రం నవంబర్ 5 నుంచి పట్టాలెక్కనుంది. నిజానికి త్రివిక్రమ్‌తో సినిమా తర్వాతే నీసన్‌తో చేస్తాడని వినిపించాయి. అయినా కూడా పవన్ నీసమ్ సినిమా తర్వాతే త్రివిక్రమ్ చిత్రం చేయనున్నాడు. ఇక పవన్ ఇచ్చిన హామీలన్నీ పూర్తయ్యాయని.. ఇక దాసరి చిత్రం ఒక్కటే పెండింగ్‌లో ఉందంటున్నారు. తన 20 ఏళ్ల కెరీర్‌లో ఇప్పటివరకు ఈ జోరు చూపని పవన్ రాజకీయాల పుణ్యమా అని వరుసగా తన అభిమానులను సంతోష పెట్టాలని ఇలాంటి షాక్ ల మీద షాక్ లిస్తున్నాడు.