మహేష్ చెప్పడు చేసి చూపుతాడు. ఒట్టిగా మాట్లాడటం ఇష్టముండదు. ఏదైనా విషయం ఉంటేనే, అక్కడ కూడా మాట్లాడాల్సినంతే మాట్లాడతాడు. దట్ ఈజ్ మహేష్. సరే విషయానికి వస్తే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు చిత్రం తర్వాత ప్రజలకు, సమాజానికి ఏదైనా చేయాలి అన్న భావంతో గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేద్దాం అని తొలిసారిగా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ విధంగా బుర్రిపాలెం అనే గ్రామాన్ని దత్తత తీసుకొని కావాల్సిన నిధులిస్తూ అభివృద్ధి చేస్తున్నాడు మహేష్ బాబు. అదే విధంగా తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామాన్ని గల్లా జయదేవ్ ఎంపీ నిథులతో అభివృద్ధి పరచిన రోడ్లను చూసి మురిసిపోతున్నాడు మహేష్ బాబు. ఈ సందర్భంగా తన బావ తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ కు మహేష్ ధన్యవాదాలు తెలిపాడు.
కాగా బుర్రిపాలెంలో గల్లా జయదేవ్ చేసిన అభివృద్ధిని చూసి మహేష్ సంబరపడ్డాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలోనూ ఫేస్ బుక్ ల ద్వారా తన బావ గల్లా జయదేవ్ ను ప్రశంసించిన మహేష్.. బుర్రిపాలెంలోని మెయిన్ రోడ్డుకు చెందిన పలు ఫోటోలను ఫేస్ బుక్ లో పెట్టాడు మహేష్. రోడ్లు చాలా బాగుపడ్డాయంటా తెగ మురిసిపోయాడు మహేష్. జయదేవ్ ఎంపీ నిధులతో ఈ రోడ్లను ఇలా అద్భుతంగా తీర్చిదిద్దాడని, తన ఆలోచనకు ఆచరణలో పెట్టిన గల్లా జయదేవ్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు మహేష్ బాబు.
అయితే మహేష్ బాబు ఏపీలో బుర్రిపాలెం గ్రామాన్ని, తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బుర్రిపాలెం గ్రామం అభివృద్ధి పథంలో నడుస్తుందనే చెప్పాలి. డ్రైనేజ్, రోడ్లు వంటివి మెరుగుపరుతున్న విషయాన్ని ఫోటోల ద్వారా మహేష్ తెలిపాడు.