నిన్న మొన్నటిదాకా మైనింగ్ అవకతవకల్లో మరియు లెక్కకు మించి ఆస్తుల విషయంలో 3 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన గాలి జనార్దన్ రెడ్డి కూతురి పెళ్ళికి దాదాపు 200 కోట్లు ఖర్చు పెడుతున్నారని ప్రచారం జరిగింది. కానీ ఐటి శాఖ తమపై డేగ కన్ను వేసిందని భయపడి ఈ పెళ్లి సామాన్య, మధ్యతరగతి పెళ్ళిమాదిరిగానే జరుగుతుందని గాలి సన్నిహితుడు శ్రీరాములు మీడియా పరం గా అందరికి తెలియజేశాడు. కానీ ఈ పెళ్లి మధ్యతరగతి తరహాలో జరగడమనేది అబద్దమని ఏదో మీడియాకి అలా చెప్పి పక్కదారి పట్టించారని... ఈ పెళ్ళికి 200 కోట్లు ఖర్చు కాదని దాదాపు 550 కోట్లు ఖర్చు చేసున్నారని సమాచారం. ఈ పెళ్లి వచ్చే నెల అంటే నవంబర్ 15, 16 తారీఖుల్లో జరగనున్న విషయం తెలిసిందే.
ఈ పెళ్లి బెంగుళూరు లోని పెద్ద ప్యాలెస్ లో జరుగనున్నట్టు... ఇంకా ఈ పెళ్ళికి 550 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఇక ఈ పెళ్ళికి బిజెపి పెద్దలు, పీఎం మోడీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వంటి పెద్దలు హాజరవుతారని... ఇప్పటికే వీరికి ఆహ్వానం అందినట్టు సమాచారం. ఇక ఈ పెళ్లిని అంగరంగ వైభవంగా దేశం మొత్తం ఎప్పటికీ గుర్తుండి పోయేలా చెయ్యాలని గాలి ముందే ప్లాన్ చేసాడు. కానీ ఐటి శాఖ తమ మీద ఎక్కడ ఫోకస్ చేస్తుందో అని భయపడి మధ్యలో మధ్యతరగతి పెళ్లి అనే టైటిల్ ని తెరపైకి తెచ్చిన గాలి ఇప్పుడు పెళ్లిని మాత్రం గ్రాండ్ గానే జరిపించనున్నాడని అంటున్నారు. అంటే గాలి ఐటి శాఖ కి భయపడకుండా ఈ పెళ్లిని జరిపిస్తున్నాడనేగా దానర్ధం.