Advertisementt

పవన్ ఈ విషయంలో తగ్గితేనే బెటర్..!

Thu 27th Oct 2016 06:47 PM
pawan kalyan,tollywood,sardaar gabbar singh,dolly,pawan kalyan vs dolly  పవన్ ఈ విషయంలో తగ్గితేనే బెటర్..!
పవన్ ఈ విషయంలో తగ్గితేనే బెటర్..!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఒప్పుకున్నాడు అంటే అతను ఆ సినిమాకి సంబందించి అన్ని విషయాల్లో వేలుపెట్టి కెలుకుతాడనే నానుడి వుంది. ఇక డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అయితే చెప్పక్కర్లేదు....డైరెక్టర్ కంటే ఎక్కువగా పవన్ ఇన్వాల్వ్ అవుతాడు. అయితే ఇది తట్టుకుని నిలబడిన వాడే పవన్ తో సినిమా చేయగలుగుతాడు. లేకుంటే దుకాణం సర్దుకుని వెళ్ళిపోతాడు. ఈ మధ్య వచ్చిన సర్దార్ సినిమానే దీనికి పెద్ద ఉదాహరణ. డైరెక్టర్ బాబీ ఈ సినిమాకి డమ్మీ డైరెక్టర్. ఈ సినిమాని పవనే తీసుకున్నాడని తెగ ప్రచారం జరిగింది. ఆ సినిమా ఏమైంది ఘోరమైన ప్లాప్ మూటగట్టుకుంది. అయినా పవన్ మనస్తత్వం లో ఏ మార్పు లేదు. మళ్ళీ పవన్ ఇప్పుడు కాటమరాయుడు సినిమాలో కూడా ఇలాంటి మాటలే వినబడుతున్నాయి. డైరెక్టర్  డాలి ని ఏదో డైరెక్టర్ కింద పెట్టుకుని ఆ సినిమాకి అన్ని తానై పవన్ నడిపిస్తున్నాడనే ప్రచారం మొదలైంది. ఇందులో భాగంగానే పవన్ డాలీ మీద తీవ్ర అసంతృప్తితో వున్నాడని అంటున్నారు. మరి పాపం డాలి ఏం చేసాడో పవన్ విషయం లో పవన్ కి అంత కోపం రావడానికి...... ఈ కోపం తోనే పవన్ షూటింగ్ స్పాట్ నుండి వెళ్లిపోయాడని ప్రచారం జరుగుతుంది. 

అయితే పవన్ మళ్ళీ తనకు తాను సర్దిచెప్పుకుని షూటింగ్ కి హాజరైనట్టు సమాచారం. అయితే పవన్ - డాలి సంబంధాలు ఇదివరకటి మాదిరిగా లేవని అంటున్నారు. ఇద్దరూ షూటింగ్ స్పాట్ లో ఎడ మొహం పెడ మొహం గా వుంటున్నారని సమాచారం. అయితే డాలి ఈ సినిమాని వదిలిపెట్టేసే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే దీనికి డైరెక్టర్ గా అనుకున్న ఎస్ జె సూర్య.. పవన్ కోసం వెయిట్ చేయలేక వెళ్లిపోయాడని రూమర్ వుంది. ఇక డాలి వెళ్ళిపోయినా ఇండస్ట్రీలో ఇలానే అనుకునే ప్రమాదం చాలానే వుంది. మరి పవన్ కొన్ని విషయాల్లో తగ్గితే బావుంటుంది లేకుంటే చాలా నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ