తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా చాలా లోటులో ఉన్న విషయం తెలిసిందే. అయినా సరే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొన్ని విషయాల్లో చాలా ఛాలెంజింగ్ గా ముందుకు వెళ్తున్నాడు. ప్రభుత్వానికి భారమని తెలిసినా చంద్రబాబు అనవసరమైన పనులన్నీ చేస్తుంది. తాజాగా అంతగా డిమాండ్ లేని చోట కూడా విమాన సర్వీస్ లను నడుపుతానంటూ ఆ వచ్చిన నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తోందంటూ వకాల్తా పుచ్చుకుంది. అంతగా గిట్టుబాటుగాని, ప్రయాణికుల రద్దీ లేనిచోట ఏ విమాన సంస్థ విమానాల్ని నడపడానికి ముందుకు రాదు. అయితే మెగా కుంటుంబంలోంచి వచ్చిన నటుడు రామ్ చరణ్ టర్బో మెగా ఎయిర్ వేస్ సంస్థకు డైరెక్టర్ గా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సంస్థతో ఏపీ ప్రభుత్వం కొన్ని ఒప్పందాలను కుదుర్చుకుంది. ఆ ఒప్పందం తలకు మించిన భారమైనా సరే ఆ నిధులను విడుదల చేసేందుకే సమాయత్తమయింది.
ప్రయాణికుల తాకిడీ ఎప్పుడో తప్ప అన్ని వేళలా అంతగా రద్దీ లేకపోయినా సరే కడప టు విజయవాడ, విజయవాడ టు తిరుపతిల మధ్య విమాన సర్వీసులు నడపాలని ఈ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రయాణికులు లేకపోయినా పర్వాలేదు, సర్వీసులు మాత్రం నడపాల్సిందే, అందుకు వచ్చే నష్టాన్ని తామే భరిస్తామని ఏపీ ప్రభుత్వం రామ్ చరణ్ డైరెక్టర్ గా ఉన్న సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసమని ప్రత్యేకంగా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ టెండర్ ను రామ్ చరణ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న టర్బో మెగా ఎయిర్ వేస్ సంస్థ దక్కించుకుంది. ఇందుకోసం గాను ఆరు నెలలకు సంబంధించిన రూ. 4.90 కోట్ల మొత్తాన్ని ఆ సంస్థకు విడుదల చేస్తూ ఏపీలోని బాబు ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. అసలే ఆర్థిక లోటులో ఉన్న ఏపీ ఇలాంటి అనవసరమైన వాటికి నిధులను ఖర్చు పెట్టి మరింత ఆర్థికలోటుకు గురౌతున్నారంటూ రాజకీయ విశ్లేషకుల భావన.