Advertisementt

ఇక ప్రభాస్ రేంజ్ ఇది...!!

Thu 27th Oct 2016 06:24 PM
prabhas,action episode,sujith director,uv creations,young rebal star  ఇక ప్రభాస్ రేంజ్ ఇది...!!
ఇక ప్రభాస్ రేంజ్ ఇది...!!
Advertisement
Ads by CJ

బాహుబ‌లి 2 త‌ర్వాత ప్ర‌భాస్ చేయ‌బోయే సినిమాపై రోజుకో కొత్త వార్త బయటకు వస్తుంది. సినిమా ప్రారంభం కాకముందే ఈ సినిమా సంచలనం అవుతుంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో నిన్న‌టివరకు బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా న‌టించ‌బోతోందంటూ వార్త ప్ర‌చారం అయిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమాపై మ‌రో కొత్త న్యూస్ షికార్లు చేస్తుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై  స్పై థ్రిల్ల‌ర్‌గా వస్తున్న ఈ సినిమాలో ఆకాశంలో ఓ ఫైట్ ఉండ‌బోతోంద‌ట‌. ఆ ఫైట్‌ ని హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ తో తెర‌కెక్కించ‌బోతున్న‌ట్టు కూడా పరిశ్రమ వర్గాల్లో వార్తలు షికారు చేస్తున్నాయి. కేవలం ఈ చిత్రంలోని ఒక్క యాక్ష‌న్ ఎపిసోడ్‌కే దాదాపు రూ.30 కోట్లు వరకు ఖర్చు చేయనున్నట్లు సమాచారం అందుతుంది.  కాగా ఈ చిత్రం డిసెంబ‌రులో కానీ, జ‌న‌వ‌రిలో కానీ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. సుమారు రూ.150 కోట్లతో తెలుగుతో పాటు, త‌మిళం, హిందీ భాషల్లో కూడా ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్న‌ట్టు సినీ సర్కిల్ టాక్. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ