త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్ లో ఒక చిత్రం ఉంటుందనేది ఫైనల్ అయిపొయింది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు వచ్చే ఈ చిత్రంపై భారీ అంచనాలే వున్నాయి. ఇక ఈ సినిమాకి ముహూర్తం కూడా కుదిరిందంటున్నారు. పవన్ - త్రివిక్రమ్ సినిమా వచ్చేనెలలో పూజా కార్యక్రమాలు జరుపుకుంటుందని... ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో రాధాకృష్ణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో నిర్మించనున్నారని సమాచారం.
అయితే ఈ చిత్రంలో పవన్ కి జోడీగా అత్తారింటికి దారేది చిత్రంలో నటించిన సమంతని తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే సమంత, త్రివిక్రమ్ డైరెక్షన్ లో అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి, అ.. ఆ.. సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు మళ్ళీ త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్ లో మరో మారు సమంతానే నటించనుందని అంటున్నారు. ఇక పవన్ తో నటించిన అత్తారింటికి దారేది చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అవడం సమంతకి ప్లస్ అవ్వడం కూడా ఈ సినిమాలో సమంత తీసుకోవడానికి కారణం అంటున్నారు. ఇక సమంత - త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్ లో వచ్చే సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్న రికార్డులన్నీ తుడిచేస్తుందని పవన్ ఫాన్స్ తెగ సంతోషపడిపోతున్నారు. ఇక ఈ చిత్రానికి తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేయనున్నాడనే విషయం తెలిసిందే.