Advertisementt

మహేష్ చిత్రం మల్టీస్టారర్ కాదు.. కొరటాల.!

Thu 27th Oct 2016 11:25 AM
koratala siva,director koratala,koratala denied rumours on mahesh multi starer movie  మహేష్ చిత్రం మల్టీస్టారర్ కాదు.. కొరటాల.!
మహేష్ చిత్రం మల్టీస్టారర్ కాదు.. కొరటాల.!
Advertisement
Ads by CJ
టాలీవుడ్ లో వరుసగా మూడు భారీ విజయాలతో హ్యాట్రిక్ సాధించి స్టార్ డైరెక్టర్ హోదాను పొందిన కొరటాల శివ తాజాగా మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్లు వినిపిస్తున్న వార్తలు గురించి తెలిసిందే. అయితే మహేష్ తో కొరటాల డైరెక్ట్ చేయబోయే చిత్రంపై పలు ఊహాగానాలు వస్తున్న విషయం కూడా విదితమే. కొరటాల, మహేష్ కాంబినేషన్ లో రాబోయే చిత్రం మల్టీస్టారర్ అనీ, అందులో నాగార్జున, మహేష్ బాబుగానీ, బాలకృష్ణ మహేష్ గానీ నటించనున్నట్లు ఈ మధ్య పలురకాల రూమర్లు షికారు చేస్తున్నాయి.  కాగా తాజాగా కొరటాల శివ ఈ అంశంపై వస్తున్న ఊహలను ఖిండించాడు. మహేష్ తో చేయబోయే చిత్రం మల్టీస్టారర్ అంటూ వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజంలేదని, అవన్నీ ఊహాగానాలు మాత్రమే అనీ, వాటిని ఎవరూ పట్టించుకోనవసరం లేదని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. దీన్నిబట్టి మహేష్ కొరటాల కాంబినేషన్ లో రాబోయే చిత్రం మల్టీస్టారర్ కాదన్నమాట. 
అయితే ఇప్పటివరకు కొరటాల చేసిన సినిమాలలో హీరో పక్కన ప్రధానమైన పాత్రలో ఏదో ఒక గొప్ప స్టార్ ని పెడుతూ వచ్చాడు. మిర్చిలో సత్యరాజ్, శ్రీమంతుడులో జగపతిబాబు, జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ వంటి ప్రముఖ నటులు ఉన్నప్పటికీ అది మల్టీస్టారర్ మూవీ మాత్రం కాకపోవడం విశేషం. ఇక మహేష్ తో కొరటాల తాజాగా తీయబోయే చిత్రాని ప్రధానమైన పాత్రకు పోటీగా ఏ ప్రముఖ నటుడిని తీసుకుంటాడో చూడాలి.
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ