నిన్న మొన్నటి వరకు తాము హీరోగా నటించిన ఒక్క చిత్రం హిట్టయినా సరే ఇక హీరోలుగా తప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా, విలన్లుగా నటించడానికి మన ఆర్టిస్ట్‌లు చిన్నతనంగా భావించేవారు. కానీ ఇప్పుడిప్పుడే టాలీవుడ్, కోలీవుడ్‌లలో కూడా మార్పు వస్తోంది. హీరోలుగా అవకాశాలు రాకపోతే తాము విలన్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా కూడా నటించడానికి ఓకే చెబుతున్నారు. తమిళంలో హీరోగా మంచి గుర్తింపు ఉన్న ఆది పినిశెట్టి ఇటీవలే 'సరైనోడు' చిత్రంలో యంగ్ విలన్‌గా నటించి మంచి మార్కులు కొట్టేశాడు. ఇక నాని-శివశంకర్‌ల కాంబినేషన్‌లో వచ్చే ఏడాది మొదలయ్యే మరో చిత్రంలో కూడా ఆది పినిశెట్టి విలన్‌గా ఓ మంచి రోల్ చేయనున్నాడు. ఇక హీరోగా ఎన్నో పరాజయాలు ఎదుర్కొన్న యంగ్‌హీరో నవదీప్ తాను ఏ పాత్రకైనా ఓకే అనడానికి రెడీగా ఉన్నానని 'బాద్‌షా'తో సిగ్నల్స్ పంపాడు. ఒకేసారి హీరోగా 9 చిత్రాలు ప్రారంభించి సంచలనం సృష్టించిన నందమూరి హీరో తారకరత్న సైతం అన్ని రకాల పాత్రలు చేసి మెప్పిస్తున్నాడు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్‌గా, హీరోగా 'నచ్చావులే.. రైడ్' చిత్రాలలో నటించిన యంగ్ హీరో తనీష్ సైతం గేరు మార్చి సందీప్‌కిషన్ హీరోగా సాయిధరమ్‌తేజ్ ప్రత్యేక పాత్రలో కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'నక్షత్రం' చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడు. ఇక హీరోగా తమిళంలో మంచి క్రేజ్ ఉన్న ఆర్య కూడా ఇప్పుడు వరస ఫ్లాప్‌ల వల్ల విశాల్ హీరోగా నటించనున్న చిత్రంతో విలన్‌గా మారుతున్నాడు. మొత్తానికి టాలీవుడ్, కోలీవుడ్‌లలో ఇప్పుడు యంగ్ విలన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు గిరాకీ బాగా పెరిగింది.