Advertisementt

కళ్యాణ్ రామ్ కు ఈ రెండు సినిమాలే ఇష్టమంట.!

Wed 26th Oct 2016 08:17 PM
kalyan ram,isam movie chit chat,hero kalyan ram  కళ్యాణ్ రామ్ కు ఈ రెండు సినిమాలే ఇష్టమంట.!
కళ్యాణ్ రామ్ కు ఈ రెండు సినిమాలే ఇష్టమంట.!
Advertisement
Ads by CJ
ఇజం హీరో కళ్యాణ్ రామ్ తాజాగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇజం సినిమా విడుదలై మిశ్రమ ఫలితాలను చవిచూస్తున్న కళ్యాణ్.. తాజాగా చిట్ చాట్ లో మాట్లాడుతూ మీ  ఇష్టమైన సినిమా గురించి అడిగినప్పుడు తమ్ముడు ఎన్టీఆర్ సినిమా తనను బాగా ఆకర్షించిందని, ఆ తర్వాత బాబాయ్ బాలకృష్ణ చేసిన సింహా చిత్రం ఎంతగానో నచ్చేసిందంటూ వెల్లడించాడు. 
కాగా ఇజం సినిమాపై మాట్లాడేందుకు చిట్ చాట్ లో పాల్గొన్న కళ్యాణ్ రామ్ మిమ్మల్ని బాగా ఆకర్షించిన సినిమాల గురించి తెల్పమన్నప్పుడు అలా స్పందించాడు. ఈ మధ్య కాలంలో అంటే థియేటర్లలో బాగా మెప్పించిన చిత్రంగా తనకు అత్యంత అద్భుతమైన చిత్రంగా బాలయ్య బాబాయ్ సింహా చిత్రం అంటూ తెలిపాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ కెరీర్ లో మొత్తం సినిమాలలో మీకు బాగా నచ్చిన చిత్రం ఏమిటి అని అడిగినప్పుడు రాఖీ చిత్రం అని టకీమని చెప్పేశాడు. తమ్ముడు ఎన్టీఆర్ హీరోగా చేసిన రాఖీ చిత్రంలో తమ్ముడి నటన అద్భుతంగా పండించాడు. ఆ చిత్రంలో శ్మశానంలో చెల్లెలు ఇలా కనిపించి అలా వెళ్లిపోతుంది, ఆ సన్నివేశం చూస్తున్నప్పుడు నిజంగా కళ్ళళ్లో నీళ్ళు తిరిగాయి. తమ్ముడి నటన కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది అంటూ తనదైన శైలిలో వివరించాడు. 
ఇంకా కళ్యాణ్ రామ్ సీనియర్ ఎన్టీఆర్ సినిమాలలో మీకు నచ్చినవి అని అడిగినప్పుడు మాత్రం ఇవీ అవీ అని కాదు చాలా ఉన్నాయి. అందులో మిస్సమ్మ, గుండమ్మ కథ ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. ఇంకా కళ్యాణ్ రామ్ ఎమోషనల్ గా మాట్లాడుతూ తన జీవితంలో కూడా ఓ లవ్ స్టోరీ  ఉందనీ, అది మరెవరితోనూ కాదు, పెళ్ళయ్యాక తన భార్యతోనే అని చిట్ చాట్ లో తనదైన శైలిలో వివరించాడు కళ్యాణ్ రామ్.
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ