Advertisementt

కృష్ణవంశీ చిత్రంలో బాలయ్యలెందరో తెలుసా?

Wed 26th Oct 2016 07:55 PM
balakrishna,raithu movie,3 getups,amitabh bachchan,balakrishna movies  కృష్ణవంశీ చిత్రంలో బాలయ్యలెందరో తెలుసా?
కృష్ణవంశీ చిత్రంలో బాలయ్యలెందరో తెలుసా?
Advertisement
Ads by CJ

ప్రతి సినిమాలోనూ రెండు మూడు గెటప్పులు వేయందే బాలయ్యకి నిద్రపట్టదు. బాలయ్య మొదటినుండి.. ఇటీవల వచ్చిన చిత్రాల వరకు ఆయన ప్రతి చిత్రంలోనూ రెండు మూడు గెటప్పుల్లో కనిపిస్తాడు. ఇక ముసలి గెటప్పులు వేయడం విషయంలో కూడా బాలయ్య తర్వాతే ఎవరైనా. పెద్దన్నయ్య నుండి అధినాయకుడు వరకు పలు చిత్రాలలో ఆయన ముసలి గెటప్పులు కూడా వేశాడు. తాజాగా ఆయన కృష్ణవంశీ డైరెక్షన్‌లో చేయబోయే 101 వ చిత్రం 'రైతు'లో కూడా మూడు గెటప్పుల్లో బాలయ్య కనిపించనున్నాడట. కుర్రాడిగా, మధ్య వయస్కుడిగా, ముసలితనంలో ఆయన కనిపించనున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఓ విద్యావంతుడు 'రైతు'గా మారి రైతుల సమస్యలు, వారి సంక్షేమం కోసం ఏమేం చేయాలో అన్నీ చేస్తాడట. చివరకు 'రైతు' ఉద్యమాన్ని తన ముసలితనంలో కూడా మొదలుపెట్టి రాష్ట్రపతిగా పాత్ర వేయనున్న అమితాబ్‌బచ్చన్‌ వరకు తీసుకెళ్లి రైతుల సమస్యలను ఎలా పరిష్కరించాడు? అనేది ఈ చిత్ర కథ అంటున్నారు. కాగా ఈ చిత్రంలో డ్యూయెట్స్‌, హీరోయిన్లలో డ్యాన్స్‌లు వంటివి ఉండవని, అవన్నీ పెడితే సినిమా ఫ్లోకు అవి అడ్డంకిగా మారుతాయనే ఉద్దేశ్యంలో బాలయ్య, కృష్ణవంశీ భావిస్తున్నారని సమాచారం. మొత్తానికి కథ డిమాండ్‌ చేస్తే ఏ పాత్రనైనా చేసే బాలయ్య గట్స్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ