సాధారణ నటునిగా సినీ జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్‌గా మారిన చిరంజీవి బ్లడ్‌బ్యాంకు, ఐ బ్యాంకులను స్దాపించి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి తన అభిమానుల్లో సేవా కార్యకార్యక్రమాలకు స్ఫూర్తినిచ్చి, ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. ఇక ఆయన సోదరుడు పవన్‌కళ్యాణ్ అయితే పబ్లిసిటీకి దూరంగా తన సహాయం కోసం ఎదురుచూసే బాధితులను గుర్తించి వారికి అడిగినంత సాయం చేసి ఎందరి జీవితాలలోనో వెలుగులు పంచుతున్నాడు. ఒక విధంగా సేవా రంగం విషయంలో చిరును పవన్‌కళ్యాణ్ ఎప్పుడో దాటిపోయాడు. తాజాగా మరో మెగా హీరో రామ్‌చరణ్ కూడా ఇటీవల సామాజిక సేవా కార్యక్రమాల వైపు దృష్టి సారించి, తాను కూడా తన తండ్రి, బాబాయ్‌ల బాటలోనే నడుస్తూ అందరి ప్రశంసలు చూరగొంటున్నాడు. ఇటీవల రామ్‌చరణ్ సహాయం కోసం ఓ కుటుంబం ఎంతగానో తాపత్రయపడింది. పుట్టుకతోనే వినికిడి శక్తి లేని ఇద్దరు చిన్నారులకు ఆయన తన సొంత డబ్బుతో శస్త్ర చికిత్స చేయించి సెహభాష్ అనిపించుకున్నాడు. ఇప్పుడు ఆ చిన్నారులిద్దరూ మనలానే వినగలుగుతున్నారంటూ ఆనందాన్ని తన అభిమానులతో పంచుకున్నాడు రామ్‌చరణ్. ఇక ఇటీవలే ఆయన తాజా చిత్రం 'తని ఒరువన్' రీమేక్ 'ధృవ' చిత్రం షూటింగ్ టాకీపార్ట్ పూర్తి చేసుకుంది. ఇటీవల దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు విశేష స్పందన వస్తోంది. ఇక ఈ చిత్రంలో బ్యాలెన్స్ ఉన్న ఓ పాటను కూడా పూర్తి చేసి నవంబర్ 20న ఆడియోను, డిసెంబర్ 2న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.