వైసిపి అధినేత జగన్ తన ఎంపీల చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు తెర తీద్దామని కలలు కంటున్నాడు. నిన్న జరిగిన వైసిపి మీటింగ్ లో తన ఎంపీలంతా ప్రత్యేక హోదా కోసం రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించి కేంద్రానికి డెడ్ లైన్ పెట్టాలని చూస్తున్న విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా సాధన కోసం ఈ మధ్యన ఏపీలో యువ భేరి సభలు నిర్వహిస్తూ జగన్ కాస్త బిజీ గా గడుపుతున్నాడు. అయితే రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులు వేయడం, టైం చూసి ఎదుటివారిని దెబ్బకొట్టడానికి చాలా అనుభవం ముఖ్యం. అయితే జగన్ కి రాజకీయ అనుభవం చాలా తక్కువ. ఇప్పుడు జగన్ పొలిటికల్ గా వీక్ అని చాలా మంది సీనియర్ నాయకులూ చెబుతున్న మాట. వైసిపి పార్టీలో మొన్నటి దాకా ప్రముఖ పాత్ర పోషించి పార్టీకి సలహాలిచ్చిన మైసూరా రెడ్డి ఇప్పుడు వైసిపి కి దూరం గా ఉంటున్నాడు. ఎందుకంటే జగన్ ఎవరి మాట వినడు... అతను అనుకున్నదే అతను చేసేస్తాడు. మరి రాజకీయానుభవం లేకుండా, పెద్దల మాట వినకుండా జగన్ చాలా తప్పులే చేస్తున్నాడని ఇప్పుడు కొంతమంది సీనియర్స్ వాదన.
అయితే ఇప్పుడు జగన్ తన ఎంపీల చేత రాజీనామా చేయించడం రాజశేఖర్ ఆత్మస్నేహితుడు కెవిపి కి పెద్దగా నచ్చలేదంట అందుకే అతను జగన్ మీద ఫైర్ అవుతున్నాడని టాక్. జగన్ పై చిటపటలాడుతున్న కెవిపి జగన్ ని కొన్ని విషయాల్లో తప్పుపడుతున్నాడట. ఆ విషయలేమంటే ప్రస్తుతం ప్రత్యేక హోదా విషయం ఏపీలో చల్లారి పోయింది. ఇలాంటి సమయం లో జగన్ తన ఎంపీల చేత రాజీనామా చేయించి ఏం చేస్తాడు.... అసలిప్పుడు ఈ రాజీనామా అస్త్రాల్ని ఉపయోగించడం కరెక్ట్ కాదని కెవిపి అంటున్నాడు. 2014 ఎన్నికలకంటే ముందు ఉప ఎన్నికల పేరు మీద జగన్ తన బలాన్ని బయటపెట్టేశాడని, దీంతో అలెర్టయిన చంద్రబాబు... జగన్‌ని జనరల్ ఎలక్షన్స్‌లో వ్యూహాత్మకంగా దెబ్బకొట్టాడని కేవీపీ అంటున్నాడు. ఇప్పుడు కూడా జగన్ అవే తప్పులు మళ్లీ చేస్తున్నాడని కేవీపీ తన సన్నిహితుల దగ్గర వాపోతున్నాడట. ఎంతైనా స్నేహితుడు కొడుకు కదా అందుకే నష్టపోతుంటే చూస్తూ ఊరుకోలేక కెవిపి అలా చేస్తున్నాడు అని అంటున్నారు. మరి జగన్ కి అంకుల్ మీద అంత ప్రేమ ఉండాలిగా ఆయన చెప్పింది వినడానికి.