Advertisementt

విడాకులిచ్చిన భర్తే మళ్ళీ కావాలంట.!

Wed 26th Oct 2016 04:27 PM
cine actress rambha,rambha marriage,rambha diverse case  విడాకులిచ్చిన భర్తే మళ్ళీ కావాలంట.!
విడాకులిచ్చిన భర్తే మళ్ళీ కావాలంట.!
Advertisement
Ads by CJ
అప్పట్లో అంటే 1990 దశకంలో రంభకు  టాలీవుడ్ లో ఓ రేంజ్ పాలోయింగ్ ఉంది. ఇంతటి క్రేజీ భామ ఆ కాలంలో టాప్ హీరోలందరితో సినిమాలు చేసి మంచి పేరును సంపాదించుకుంది. అయితే   రంభ 2010లో ఇందిరన్ పదమాందన్ అనే వ్యక్తిని వివాహం ఆడి సినిమాలు చేయడం తగ్గించేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు వాళ్లిద్దరు విడాకులు తీసుకున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఒంటిరిగా ఉంటున్న రంభకు ఉన్నట్టుండి ఏం గాలి మళ్లిందో ఏమోగానీ, అప్పటి మా బంధాన్ని మళ్లీ కలపాలని, తామిద్దరం కలిసుండాలని కోరుకుంటున్నాని వెల్లడిస్తుంది. అందుకు చట్టం కూడా ఒప్పుకుంటుందని, హిందూ వివాహ చట్టం సెక్షన్ 9 ప్రకారం తమ బంధం మళ్ళీ కొనసాగించేలా కోర్టును ఆశ్రయించింది రంభ. చెన్నైలోని ఓ ఫ్యామిలీ కోర్టులో దాఖలైన ఈ పిటిషన్ పై ప్రస్తుతం విచారణ జరుగుతుంది. కాగా రంభ, ఇందిరన్ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. 
అయితే రంభ ఇప్పుడు తాజాగా బయటకు వచ్చి తన భర్తను తనకు దగ్గర చేయండి అంటూ కోర్టును ఆశ్రయించింది. కాగా తమిళనాడులోని ఫ్యామిలీ కోర్టులో విచారణకు వచ్చిన ఈ పిటిషన్  డిసెంబర్ 3 వ తేదీన తీర్పు వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తుంది