టాలీవుడ్ సినిమాలకు శాటిలైట్స్ రైట్స్ అనేది చాలా అవకాశంగా పరిశ్రమ భావిస్తుంది. అసలు కొన్ని చిన్న సినిమాలైతే ముందు శాటిలైట్ రైట్స్ అమ్ముకొనే ఆ మొత్తంతో సినిమాకు కొంత పెట్టుబడిగా ఉపయోగించుకుంటారు. ఇక పెద్ద హీరోల విషయం చెప్పనే అక్కరలేదు. ఇదిలా ఉండగా ఇప్పుడు బడా హీరోల సినిమాలు నిర్మాణ దశలో ఉండగా చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, రామ్చరణ్, ప్రభాస్ వంటి వారి సినిమాలకు శాటిలైట్ బిజినెస్ జోరందుకుంది. అప్పుడే బాహుబలి, గౌతమిపుత్ర శాతకర్ణి, ఖైదీ నెం.150 వంటి సినిమాలకు శాటిలైట్ బిజినెస్ జరిగిపోయిందనే చెప్పాలి. ముందుగా గౌతమి పుత్ర శాతకర్ణి మాటీవీకి రూ.9 కోట్లు పలికితే, చిరు ఖైదీ నెం.150 అదే మా టీవీకి రూ.14 కోట్ల వరకు ఫ్యాన్సీ ఆఫర్ కొట్టేసినట్టు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అయితే ఖైదీ నెం.150 సినిమా శాటిలైట్ హక్కుల కోసం పోటాపోటీగా బిజినెస్ నడిచినట్లు తెలుస్తుంది. మొదట జీ తెలుగు రూ.12 కోట్ల వరకూ వచ్చి ఆగిపోయిందని, అసలు జెమినీ టీవీ రేసులో కూడా లేకుండా పోయిందని, మాటీవీకీ చిరంజీవికీ మంచి దగ్గర సంబంధాలు ఉండటం కారణంగా అంత మొత్తంలో రేటు పలుకిందని తెలుస్తుంది. అంతే కాకుండా... మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం చిరంజీవి నిర్వహిస్తుండటంతో ఈ సినిమాకు ఇంతగా శాటిలైట్ బిజినెస్ అయిందని పరిశ్రమ వర్గాల టాక్. ఇంతటి లింక్ కారణంగా మాటీవీ రూ.14 కోట్లకు భారీ ఆఫర్ తో బిజినెస్ జరిగినట్లు టాక్ నడుస్తుంది. ఇకపోతే నాలుగైదు రోజుల్లో ఖైదీ నెం. 150 చిత్రానికి శాటిలైట్ హక్కలకు క్లియరెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇకపోతే మహేష్ బాబు –మురుగదాస్ కాంబినేషన్ లోని సినిమా శాటిలైట్స్ హక్కులు జీ తెలుగు రూ.16 కోట్లకు తీసేసుకుందని టాక్ నడుస్తుంది. కాగా సంక్రాంతికి విడుదల చేసేందుకు నవంబరు ఆఖరికల్లా చిత్రీకరణ పూర్తి చేయాలన్న తలంపుతో ఖైది నెంబర్.150 చిత్రబృందం కంకణం కట్టుకొని తీవ్రంగా కష్టపడుతున్నట్లు తెలుస్తుంది.