Advertisementt

నిజంగా లారెన్స్.. సూపర్‌స్టారే..!

Tue 25th Oct 2016 08:41 PM
lawrence,super star,open heart surgery,raghava lawrence  నిజంగా లారెన్స్.. సూపర్‌స్టారే..!
నిజంగా లారెన్స్.. సూపర్‌స్టారే..!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం ప్రతి రంగంలోనూ మీడియా ప్రాధాన్యత పెరిగింది. దీంతో రూపాయి సహాయం చేసిన వారు కూడా దాని ప్రమోషన్‌కు, పబ్లిసిటీకీ 10 రూపాయల ఖర్చుపెడుతున్నారు. కాగా ఇటీవల ఓ విచిత్రం జరిగింది. కొరియోగ్రాఫర్‌గా, నటునిగా, దర్శకునిగా వెలుగొందుతున్న లారెన్స్‌ చేసిన సాయం గురించి లబ్దిదారులు తెలిపేంత వరకు ఒక విషయం రహస్యంగా ఉంది. ఇటీవల లారెన్స్‌ సంస్ధ ప్రతీక అనే చిన్నారికి ఓపెన్‌హార్ట్‌ సర్జరీ చేయించింది. వైద్యపరంగా ఇబ్బందులు పడుతున్న చిన్నారుల వైద్యానికి తాను సినిమాల ద్వారా పొందిన తన సంపాదనతో లారెన్స్‌ ఈ ఆపరేషన్లు చేయిస్తున్నాడు. ప్రతీక అనే పాప ఓపెన్‌హార్ట్‌ సర్జరీతో లారెన్స్‌ సంస్ధ ఇప్పటివరకు 131మందికి ఓపెన్‌హార్ట్‌ సర్జరీలు చేయించినట్లు తెలుస్తోంది. చెన్నై వరద బాధితులను కూడా స్టార్స్‌ కంటే ఎక్కువగా కోటిరూపాయలు విరాళం అందించిన లారెన్స్‌ చేస్తున్న సామాజిక సేవను ఈ విషయం తెలిసిన వారు అభినందనలతో ముంచెత్తుతున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ