'సరైనోడు' బ్లాక్‌బస్టర్‌తో మంచి ఊపులో ఉన్న మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో ఓ చిత్రం చేస్తున్నాడు. దీని తర్వాత ఆయన మెగాస్టార్ చిరంజీవి చిత్రాన్ని డైరెక్ట్ చేస్తాడని ప్రచారం జరుగుతోంది. కాగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో ఆయన చేయబోయే చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మాతగా వ్యవహరించనున్నాడు. కానీ ఈ చిత్రం నుండి అభిషేక్ పిక్చర్స్ సంస్ద వైదొలిగిందని తాజా సమాచారం. టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతున్నట్లు ఈ చిత్రం నుండి అభిషేక్ పిక్చర్స్ వైదొలగడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. బోయపాటి తన 'సరైనోడు' చిత్రానికి రూ.10కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. ఈ తాజా చిత్రానికి ఆయన మరో రెండు కోట్లు అదనంగా పెంచి తన రెమ్యూనరేషన్‌ను 12కోట్లకు పెంచాడని సమాచారం. దీనికి బెల్లంకొండ సాయి తండ్రి మరో నిర్మాత అయిన బెల్లంకొండ సురేష్ కూడా బోయపాటికి అనుకూలంగా వాదించడంతో పాటు తాను ఖర్చుపెట్టినట్లుగానే 'అల్లుడుశీను'కు పెట్టినంత మొత్తాన్ని బడ్జెట్‌గా పెట్టాలని ఆయన కూడా అభిషేక్ పిక్చర్స్‌కు కండీషన్ పెట్టాడని, అంతంత పెద్ద మొత్తాన్ని బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చిత్రానికి ఖర్చుపెట్టడం రిస్క్‌గా భావించిన అభిషేక్ సంస్ద ఈ ప్రాజెక్ట్ నుండి అర్ధాంతరంగా తప్పుకొందని సమాచారం. ఇక మరో కథనం ప్రకారం అభిషేక్ పిక్చర్స్ సంస్ద ఒకేసారి నాలుగైదు ప్రాజెక్ట్‌లను నిర్మించడానికి సిద్దపడిందట..! ఇన్ని చిత్రాలను ఆ సంస్ద ఒకేసారి నిర్మించనుండటంతో తన కొడుకు సినిమాను పూర్తిగా పట్టించుకోలేరని, తన కొడుకు చిత్రంపై పూర్తి శ్రద్ద చూపలేరని భావించిన బెల్లంకొండ సురేష్ భావించడమే దీనికి కారణం అంటున్నారు. ఈ చిత్రాన్ని కోనవెంకట్‌తో కలిసి 'సాహసం శ్వాసగా సాగిపో' నిర్మాత ఎల్.రవీంద్రరెడ్డి నిర్మాతగా వ్యవహరించనున్నాడని తాజా సమాచారం.