Advertisementt

సమంత ఫ్యాన్స్‌ ఫుల్ హ్యాపీ...!

Tue 25th Oct 2016 07:51 PM
samantha,vishal,naga chaitanya,samantha movie entry  సమంత ఫ్యాన్స్‌ ఫుల్ హ్యాపీ...!
సమంత ఫ్యాన్స్‌ ఫుల్ హ్యాపీ...!
Advertisement
Ads by CJ

తెలుగు టాప్‌ హీరోయిన్‌ సమంత నాగచైతన్యతో ప్రేమాయణం నడుపుతోన్న సంగతి తెలిసిందే. పెళ్లి జరిగిన తర్వాత కూడా తాను నటిస్తానని ఆమె క్లారిటీ ఇచ్చింది. కానీ చైతుతో ఎఫైర్‌ బయటకి తెలిసిన తర్వాత 'జనతాగ్యారేజ్‌' మాత్రమే చేసింది. మరో తెలుగు చిత్రం ఒప్పుకోలేదు. దాంతో ఆమె మరలా మేకప్‌ వేస్తుందా? లేదా? అన్న విషయంలో అందరూ అయోమయంలో పడ్డారు. కానీ తాజాగా 'జనతాగ్యారేజ్‌' తర్వాత ఇంత గ్యాప్‌ తీసుకున్న సమంత ఇప్పటికీ తమిళ చిత్రాలను ఒప్పుకొంటూనే ఉంది. ప్రస్తుతం ఆమె తమిళంలో విశాల్‌, శివకార్తికేయన్‌ చిత్రాలలో నటించడానికి ఓకే చెప్పింది. తాజాగా ఆమె మంచి ఘడియలు చూసుకొని విశాల్‌ నటిస్తున్న చిత్రం సెట్లోకి ఎంటర్‌ అయింది. దీంతో తమ హీరోయిన్‌ ఇక నటిస్తుందా? నటించదా? అని టెన్షన్‌ పడుతోన్న అభిమానులకు ఆమె పూర్తి క్లారిటీ ఇచ్చేసింది. దీంతో సమంత అభిమానులు ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఉన్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ