పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, శృతిహాసన్ జంటగా డాలీ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం 'కాటమరాయుడు' అనుకున్న సమయం కన్నా ఆలస్యంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఉగాది కానుకగా మార్చి 29న విడుదల చేస్తున్ననట్లు క్లారిటీ ఇచ్చారు. కాగా పవన్ ముందు చిత్రం 'సర్దార్ గబ్బర్‌సింగ్' కూడా ఈ ఏడాది ఉగాది కానుకగా విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో పవన్‌కు ఉగాది కలిసిరాలేదని, తన తదుపరి 'కాటమరాయుడు' కు అదే సెంటిమెంట్‌గా భావించి ఆయన అభిమానులు భారీగా టెన్షన్ పడుతున్నారు. కాగా ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ షూటింగ్‌లో శృతిహాసన్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇక పవన్‌కు బైక్‌రైడింగ్‌లు, గన్నులంటే చాలా ఇష్టం. 'గోపాల గోపాల' కోసం పవన్ ప్రత్యేకంగా ఓ బైక్‌ను డిజైన్ చేయించిన సంగతి తెలిసిందే. ఇక 'కాటమరాయుడు'లో కూడా పవన్ ఓ బుల్లెట్‌పై తిరుగుతూ హల్‌చల్ చేయనున్నాడు. దీని నెంబర్.. 1. మరి ఆయనకిష్టమైన గన్‌లు కూడా ఈ చిత్రం కోసం వాడుతున్నారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి 'కాటమరాయుడు'గా పవన్ ఎలా కనిపించబోతున్నాడు? ఈ చిత్రం ఉగాది సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తుందా? లేక కలిసొస్తుందా? అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.