బాహుబలి2 చిత్రం ఫస్ట్ పోస్టర్ లాంచింగ్ సందర్భంగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. బాహుబలి మొదటి భాగంలో తాను స్క్రీన్ పై కన్పించి చాలా తప్పు చేసినట్లుగా వెల్లడించాడు. కాగా రాజమౌళి, బాహుబలి చిత్రం తొలిభాగంలో అతిథి పాత్రలో కాసేపు తెరపై మెరిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. తాను బాహుబలి రెండవభాగంలో కన్పించదలచుకోవడం లేదని ఆయన అన్నాడు. అసలు మొదటి భాగంలోనే కనిపించి తాను చాలా తప్పుచేశానని, అలాంటి సాహసం మళ్ళీ చేయలేనని వెల్లడించాడు ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి. అందులో కనిపించడం నిజంగా తన పొరపాటుగా రాజమౌళి వివరించాడు. ఇంకా రాజమౌళి మాట్లాడుతూ.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అన్న అంశం ఇంతగా పాపులర్ అవుతుందని తాను భావించలేదని, అసలు గొప్ప సంచలనం రేపిన అంశంగా ఇది మారిందని ఆయన వివరించాడు.