Advertisementt

కృష్ణవంశీ సపోర్ట్ తోనైనా నిలబడతాడా..!

Tue 25th Oct 2016 04:26 PM
tanish,krishna vamsi,nakshatram movie looks,tanish villain entry,sandeep kishan  కృష్ణవంశీ సపోర్ట్ తోనైనా నిలబడతాడా..!
కృష్ణవంశీ సపోర్ట్ తోనైనా నిలబడతాడా..!
Advertisement
Ads by CJ

డైరెక్టర్ కృష్ణవంశీ.. సందీప్ కిషన్ హీరోగా 'నక్షత్రం' తెరకెక్కిస్తున్నాడు. ఈ 'నక్షత్రం' సినిమా  కోసం కృష్ణవంశీ ఒక కొత్త యాంగిల్ లో ఆలోచిస్తున్నాడు. అందుకే హీరో దగ్గర నుండి విలన్ వరకు... అంతే కాదు అందులో చేసే గెస్ట్ ల ఫస్ట్ లుక్ లని కూడా డిఫరెంట్ గా విడుదల చేస్తున్నాడు. మొదటగా సందీప్ చేతి లుక్ తో స్టార్ట్ చేసిన కృష్ణవంశీ తర్వాత హీరో సందీప్ లుక్ ని, హీరోయిన్ రెజీనా లుక్ ని విడుదల చేసాడు. తర్వాత 'నక్షత్రం' లో గెస్ట్ లుగా చేస్తున్న సాయి ధరమ్ తేజ, ప్రగ్య జైస్వాల్ లుక్స్ ని విడుదల చేసాడు. మొన్నటికి మొన్న ప్రకాష్ రాజ్ లుక్ ని కూడా కాస్త డిఫ్రెంట్ గా  ప్రెజెంట్ చేసిన వంశీ ఇప్పుడు 'నక్షత్రం' సినిమాలో  విలన్ గా చేస్తున్న హీరో తనీష్ లుక్ ని విడుదల చేసాడు.

తనీష్ చిన్నప్పటి నుండి తెలుగు ఇండస్ట్రీలో ఉంటూ బాలనటుడిగా, హీరోగా చేసాడు. అయితే హీరోగా తనీష్ కి మంచి బ్రేక్ రాలేదనే చెప్పాలి. ఇక హీరోగా సినిమాలు చేయడం కుదరదని ఫిక్స్ అయ్యాడేమో అందుకే 'నక్షత్రం' లో సందీప్ కి విలన్ చేస్తున్నాడు. పోన్లే హీరో కేరెక్టర్ కోసం పడిగాపులు కాయకుండా ఏ కేరెక్టర్ అయినా పర్లేదనుకుని ఇప్పుడు విలన్ గా ఎంట్రీ ఇస్తున్న తనీష్ కి హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇక ఈ విలన్ లుక్ లో తనీష్ కాస్త భయపెట్టే రేంజ్ లోనే ఉన్నాడు. మరి హీరోగా సక్సెస్ కాలేక పోయిన తనీష్ విలన్ గా అయినా ఈ 'నక్షత్రం' చిత్రం ద్వారా సక్సెస్ అవుతాడని ఆశిద్దాం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ