Advertisementt

కాజల్ కి ఇక అదే యావంట...!

Tue 25th Oct 2016 02:59 PM
kajal agarwal,commercial movies,khaidi no 150,teja director,experimental movies  కాజల్ కి ఇక అదే యావంట...!
కాజల్ కి ఇక అదే యావంట...!
Advertisement
Ads by CJ

నాకు అవార్డ్స్ అక్కర్లేదు. ఇలా అన్నది ఎవరో కాదు టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. డైరెక్టుగా నాకు అవార్డ్స్ అక్కర్లేదు అనలేదు గాని అదే మీనింగ్ వచ్చేలాగా కాజల్ మాట్లాడుతోంది. ఇప్పుడు కాజల్ అగర్వాల్.. చిరంజీవి 150 వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' లోను.... ఇంకా తనని ఇండస్ట్రీ కి పరిచయం చేసిన డైరెక్టర్ తేజ సినిమాలో నటిస్తుంది. ఇప్పటివరకు పక్కాగా కమర్షియల్ చిత్రాలే చేసుకుంటూ పోతుంది కాజల్. ఇక తన కెరీర్లో ఇలాంటి కమర్షియల్ సినిమాలే చేస్తాను అని అంటుంది. అసలు ప్రయోగాత్మక చిత్రాల జోలికి, లేడి ఓరియెంటెడ్ చిత్రాల జోలికి వెళ్లనని డైరెక్ట్ గా చెబుతుంది. తనకి అలాంటి చిత్రాలంటే భయమని చెబుతోంది. అయితే క్రిటిక్స్ మాత్రం భయము పాడు లేదు కాజల్ చాలా తెలివిగా మాట్లాడుతోందని చెబుతున్నారు.

ఇలా ప్రయోగాలు గట్రా చేస్తే అవి కేవలం అవార్డులు తెచ్చి పెడతాయి గాని రెమ్యునరేషన్ పెద్దగా ఉండదని... అందుకే కాజల్ కేవలం కమర్షియల్ చిత్రాలని నమ్ముకుంటుందని అంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ