రాజీవ్ గాంధీ హత్యకు సంబంధించి హైకోర్ట్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అవి ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ గా మారి పెను దుమారాన్ని రేపుతున్నాయి. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. ఓ హెడ్ కానిస్టేబుల్ కేవలం రూ. 200 కి కక్కుర్తి పడి లంచం తీసుకోవడం కారణంగా మనం గొప్ప ప్రధానిని పోగొట్టుకున్నామని చావు కబురు చల్లగా చెప్పాడు. ఏళ్ళ తరబడి సమాజంలో నాటుకుపోయిన అవినీతిని తెగనరకాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించాడు. ఓ హెడ్ కానిస్టేబుల్ రెండువందల రూపాయలకు కక్కుర్తి పడి తీసుకోవడం మూలంగానే ఎల్టీటీఈ దళం ఆత్మహుతి దాడి జరపడానికి కారణం అయిందని ఆయన వివరించాడు.
కాగా జాతీయ అవినీతి కౌన్సిల్ హైదరాబాద్ లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఓ చిన్న స్థాయిలో జరిగిన అవినీతి కారణంగానే ఎల్టీటీఈ ఆత్మహుతి దాడికి పాల్పడగలిగిందని ఆయన తెలిపాడు. కాగా దేశంలో జరుగుతున్న అవీనితి, ప్రజాసమస్యలపై మీడియా ఎప్పటికప్పుడు పోరాడుతూనే ఉండాలని ఆయన వెల్లడించాడు.