Advertisementt

ఉత్తరప్రదేశ్ లో తెలుగు సినీ నటి కి షాక్!!

Mon 24th Oct 2016 09:31 PM
uttara pradesh,jayapradha,chalana chitra vikas parishad  ఉత్తరప్రదేశ్ లో తెలుగు సినీ నటి కి షాక్!!
ఉత్తరప్రదేశ్ లో తెలుగు సినీ నటి కి షాక్!!
Advertisement
Ads by CJ

ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ముదిరి పాకాన పడ్డాయి. సమాజ్ వాదీ పార్టీలో  కుటుంబ కలహాలు ఇప్పుడు రోడ్డెక్కాయి. అఖిలేష్ కి ములాయం సింగ్ యాదవ్ తమ్ముడు శివపాల్ యాదవ్ కి ప్రత్యక్ష యుద్ధం ఆసన్నమైంది. ఈ యుద్ధంలో ఒకరికి సపోర్ట్ చేస్తే మరొకరు బలి అవుతున్నారు. ఆ కుటుంబ సమస్యలు ఇప్పుడు పార్టీలో కూడా చీలికలు తెచ్చి ఇతరులపై కూడా ప్రభావం చూపించడం మొదలెట్టాయి. అసలు పార్టీలో ఈ గొడవలకు కారణం అమర సింగ్ అని ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ ఆరోపిస్తున్నాడు. అమర సింగ్, ములాయంసింగ్ కి అత్యంత ఆప్తుడు. అందుకే అఖిలేష్... అమరసింగ్ మీద కక్ష కట్టాడని శివపాల్ ఆరోపిస్తున్నాడు. 

ఇక అమర్ సింగ్ సలహాతో ములాయం సింగ్..  జయప్రదకి ఈ మధ్యన ఉత్తరప్రదేశ్ లో చలన చిత్ర వికాస్ పరిషత్ లో ఉపాధ్యక్ష పదవి కల్పించారు. ఇక ఇప్పుడు సమాజ్ వాదీ పార్టీలో జరిగే కుమ్ములాటలు జయప్రద పదవికి ఎసరు పెట్టాయి. జయప్రద ఒకప్పుడు సమాజ్ వాదీ పార్టీలో కీలకమైన వ్యక్తిగా కొనసాగారు. ఇక ఇప్పుడు అమరసింగ్ రికమండేషన్ తో చలన చిత్ర వికాస్ పరిషత్ లో ఉపాధ్యక్ష పదవిలో కొనసాగుతున్న జయప్రదని అఖిలేష్ తొలిగించినట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే అఖిలేష్.. అమరసింగ్ ని బ్రోకర్ అని అనడంతో అక్కడ పలు సంఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. 

కేవలం అమరసింగ్ కి సన్నిహితురాలు అవడం మూలం గానే జయప్రద పదవి కోల్పోయినట్లు వార్తలొస్తున్నాయి. పాపం జయప్రద ఒక కుటుంబ కలహం వల్ల తన పదవిని కోల్పోవలసి వచ్చిందని అందరూ తెగ జాలిపడుతున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ