Advertisementt

ఇలియానా పరిస్థితి ఇలా తయారయ్యింది!

Mon 24th Oct 2016 08:53 PM
ileana,tollywood,bollywood,chances,ileana movies  ఇలియానా పరిస్థితి ఇలా తయారయ్యింది!
ఇలియానా పరిస్థితి ఇలా తయారయ్యింది!
Advertisement
Ads by CJ

ఇలియానా ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్  గా చేస్తూనే బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అక్కడ మొదటి సినిమా బర్ఫీతో మంచి మార్కులే కొట్టేసింది. కానీ తర్వాత ఆమె కు బాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ మంచి అవకాశాలు వస్తాయని ఆమె చాలా కాలమే ఎదురు చూసింది. కానీ బాలీవుడ్ ఆమెని పెద్దగా పట్టించుకోలేదు. ఇక మళ్ళీ టాలీవుడ్ కి తిరిగి పయనమవుతుంది కదా అనుకుంటే ఆమె ఇటు వైపు అస్సలు చూడలేదు. ఇక ఈ భామ తెలుగులో నటించదేమో అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కాని ఇలియానా మాత్రం అప్పుడప్పుడు ఒకటి అరా తెలుగు ఫంక్షన్స్ కి అటెండ్ అవుతూ.... ఒకటి రెండు స్టార్  హీరోల సినిమాల్లో చేసింది. కానీ పూర్తిగా టాలీవుడ్ లో ఉండలేకపోయింది. 

కారణం ఏమిటో ఇలియానా ఈ మధ్యనే బయటపెట్టింది. నేను టాలీవుడ్ కి కావాలని దూరమవలేదని.... ఏదో బాలీవుడ్ అవకాశం వచ్చి అక్కడికి వెళ్తే ఇక్కడ టాలీవుడ్ వాళ్ళు తనని అసలు పట్టించుకోవడం మానేశారని, తాను ఎవరిని అవకాశాల కోసం అడుక్కోవాల్సిన అవసరమా లేదని... అలా అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తే నా హుందాతనాన్ని కోల్పోవడమే అని చెప్పుకొచ్చింది. అందుకేనేమో ఆమె టాలీవుడ్ సినిమాలకి దూరమయ్యింది. అసలు టాలీవుడ్ డైరెక్టర్స్ గాని ప్రొడ్యూసర్స్ గాని ఆమెని ఎందుకు సంప్రదించలేదు...! ఎందుకంటే....ఎందుకులే అమ్మడు బాలీవుడ్ రేంజ్ కి వెళ్లిపోయిందిగా మనకెందుకులే అని పక్కన పెట్టేసినట్టున్నారు. ఏదిఏమైనా పాపం ఇలియానా పరిస్థితి మాత్రం రెండికి చెడ్డ రేవడిలా తయారైంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ