సినిమారంగంలో క్యాస్ట్ (కుల) ఫీలింగ్ లేదని, కేవలం క్యాష్ ఫీలింగ్ మాత్రమే ఉందని గీత రచయిత అనంత శ్రీరామ్ సెలవిచ్చాడు. ఇది నిజమేనా? క్యాస్ట్ ఫీలింగ్ కారణంగానే చాలా మందికి అవకాశాలు వస్తున్నాయనే విషయం అనంత గ్రహించినట్టు లేదు. అంతెందుకు క్యాస్ట్ కారణంగానే ఆయన కెరీర్ మెుదలైంది. తొలి అవకాశం ఆ విధంగానే వచ్చింది. చిరంజీవి సినిమాలో అవకాశం, అటు పిమ్మట కృష్ణవంశీ వంటి వారు అనంత శ్రీరామ్ ని ప్రోత్సహించడానికి ఇదే కారణమని చాలా మందికి తెలుసు. అనంత శ్రీరామ్ పెదనాన్న చేగొండి హరిరామ జోగయ్య కాపు కులస్తుల కోసం బహిరంగంగా పోరాడిన విషయం తెలిసిందే. చిరంజీవి 'ప్రజారాజ్యం' కోసం పాట రాసే అవకాశం కూడా అనంత శ్రీరామ్ కు క్యాస్ట్ కారణంగానే వచ్చింది.
ఇవన్నీ నిజాలే. అయితే టాలీవుడ్ లో కమ్మ సామాజిక వర్గానిది పై చేయి. కాబట్టి ఆ వర్గాన్ని దూరం చేసుకోకుండా ఉండాలనే క్యాస్ట్ ఫీలింగ్ లేదని అనంత శ్రీరామ్ చెప్పారనుకోవచ్చు. పొందికైన పదాలతో పసందైన పాటలు రాసే అనంత కులాల గురించి మాట్లాడకుండా ఉండాల్సింది.