Advertisementt

కమల్ ముందు జాగ్రత్త !

Mon 24th Oct 2016 08:33 PM
tamil nadu,jayalalithaa health,vishwaroopam movie,kamal birthday celebrations  కమల్ ముందు జాగ్రత్త !
కమల్ ముందు జాగ్రత్త !
Advertisement
Ads by CJ

విశ్వనటుడు కమల్ హాసన్ కు గతానుభవం గుర్తొచ్చి ఉంటుంది. అందుకే తన పుట్టిన రోజు వేడుకలు (నవంబర్ 7) జరపవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. గతానుభవం అంటే భారీ పెట్టుబడితో తీసిన 'విశ్వరూపం' సినిమా రిలీజ్ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలిత ఈ సినిమా రిలీజ్ కు చెక్ పెట్టింది. 'విశ్వరూపం'  వల్ల శాంతి భద్రతల సమస్య వస్తుందని నిలుపుచేసింది. దాంతో కమల్ గగ్గోలు పెట్టాడు. ఆవేదన చెందాడు. సొంత ఇంటిని కుదవపెట్టి తీశానని బాధపడ్డాడు. జయలలిత ఇచ్చిన షాక్ నుండి తేరుకోవడానికి చాలా కాలం పట్టింది. చివరికి సినిమా మధ్యవర్తిత్వం కారణంగా విడుదలైంది. 

ఇప్పటి విషయానికి వస్తే 'అమ్మ' జయలలిత అపోలో హాస్పటల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీపావళి వరకు డిశ్చార్జి కావచ్చని తెలుస్తోంది. దీపావళి తర్వాత వారం రోజులకు కమల్ బర్త్ డే వస్తుంది. ఆ పరిస్థితిలో తన బర్త్ డే ఘనంగా జరిగితే అపార్ధాలకు తావుతీస్తుందని, జయలలిత దృష్టిలో పడితే ప్రమాదం అని ముందే గ్రహించి అభిమానులకు విజ్ఞప్తి చేశారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ