Advertisementt

వీరి కాంబినేషన్ లో మూవీ రాబోతుందా..?

Mon 24th Oct 2016 06:05 PM
jr ntr new movie with trivikram,trivikram ntr combo,trivikram jr ntr combo new movie  వీరి కాంబినేషన్ లో మూవీ రాబోతుందా..?
వీరి కాంబినేషన్ లో మూవీ రాబోతుందా..?
Advertisement
Ads by CJ

తాజాగా ఓ అద్భుతమైన కాంబినేషన్ లో సినిమా పడబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందిన సమాచారాన్ని బట్టి.. ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో సినిమా అంటూ టాలీవుడ్ లో న్యూస్ చక్కర్లు కొడుతుంది. అసలు వీరిద్దరిలో హఠాత్తుగా సినిమా ఏంటబ్బా అంటూ టాలీవుడ్ లో చర్చలు నడుస్తున్నాయి. నిజంగా ఉందా? లేకా గాలి వార్తలా? అన్న విషయంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. కాగా ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్  కాంబినేషన్ లో రాబోయ్ సినిమాపై కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెల్లడౌతున్నాయి.

అయితే ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ కాంబినేషన్ లో  సినిమా త‌ప్ప‌కుండా ఉంటుంద‌ని, కానీ దీపావ‌ళి  తర్వాతనే  వీరి సినిమాకు చెందిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. కానీ సినిమా ప్రారంభం మాత్రం ఇప్పట్లో ఉండదని టాక్ నడుస్తుంది. సినిమా మాత్రం వచ్చే సంవత్సరం ప్రారంభం కావచ్చని తెలిస్తుంది. ప్రస్తుతం ప‌వ‌న్ తో ఓ సినిమా చేయ‌డానికి త్రివిక్రమ్ సిద్ధమౌతుండటంతో దానికి సంబంధించిన కథా చ‌ర్చ‌ల్లో త్రివిక్రమ్ బిజీగా ఉన్నాడు.  కాబట్టి పవర్ స్టార్ తో సినిమా పూర్తి చేసిన తర్వాతనే ఎన్టీఆర్ సినిమా ప్రారంభిస్తానని త్రివిక్రమ్ చెప్పినట్లు అందుకు ఎన్టీఆర్ కూడా ఓకే అన్నట్లు ఇద్దరూ ఆ రకంగా ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది.  విషయం ఏంటంటే ఎన్టీఆర్ తో చేసే సినిమాకు సంబంధించిన కథను ఇంకా త్రివిక్ర‌మ్ ప్రిపేర్ చేయలేదని, కానీ ఎన్టీఆర్ తో సినిమాకు సంబంధించిన త్రివిక్రమ్ మదిలో కొన్ని ఆలోచనలు అయితే ఉన్నాయి కానీ దానికి అనుగుణంగా చేయాలని త్రివిక్రమ్ ఎన్టీఆర్ ముందు వెల్లడించినట్లు తెలుస్తుంది. మొత్తానికి దీపావ‌ళి త‌ర్వాత ప్రకటణ వచ్చినా రాకపోయినా వీరి కాంబినేషన్ లో మూవీ మాత్రం ఓకే అయినట్లు సమాచారం అందుతుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ