బారులోనే పనికానిచ్చేసిన ఘనత యాంకర్ అనసూయకు దక్కుతుంది. పనంటే మరేదో ఊహించుకోవద్దు. టీవీ 9లో అనసూయ మస్తీ పేరుతో ఒక కార్యక్రమం నిర్వహిస్తోంది. సెలబ్రిటీలు అంటే సినిమా యాక్టర్లను పిలిచి సుదీర్ఘ ఇంటర్య్వూ చేయడం. ఇందులో అతిథులకంటే తానే ఎక్కువగా మాట్లాడేస్తుంది అనసూయ. అంతేకాదు అసందర్భంగా నవ్వుతుంది. విషయానికి వస్తే యాక్టర్లను ఇంటర్యూ చేసే ముందు ఎవరైనా సరే మంచి లొకేషన్ ఎంచుకుంటారు. పార్క్, ఇల్లు, రోడ్డు వంటి లొకేషన్స్ లో ఇంటర్య్వూలు చేయడం అందరికీ తెలుసు కానీ, దీనికి భిన్నంగా ఆలోచించి, బార్ లోనే ఇంటర్య్వూ చేసి ఆసక్తి కలిగించింది అనసూయ. శని, ఆదివారాల్లో రకుల్ ప్రీత్ సింగ్ తో చేసిన ఇంటర్య్వూ ప్రసారమైంది. బార్ లో మందు బాటిల్లు కనిపిస్తున్న స్పాట్ లోనే రకుల్, అనసూయ ఎంచక్కా కూచుని మాట్లాడుకున్నారు. టీవీ 9 మరియు అనసూయ దృష్టిలో బార్ కూడా అనువైన లొకేషనే అని తేల్చినట్టు కనిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే భవిష్యత్తులో పేకాట క్లబ్, కల్లు కంపౌండ్ ల్లో కూడా సెలబ్రిటీలను ఇంటర్య్వూ చేస్తారనే డౌట్ మాత్రం ఉంది.