Advertisementt

దీపావళికి గోపిచంద్ సినిమా ఫస్ట్ లుక్..!

Sun 23rd Oct 2016 10:50 PM
gopichand,b gopal,title,balam movie,bullet movie titles  దీపావళికి గోపిచంద్ సినిమా ఫస్ట్ లుక్..!
దీపావళికి గోపిచంద్ సినిమా ఫస్ట్ లుక్..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ హీరో గోపీచంద్, బి.గోపాల్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా నిర్మాణంలో ఉంది. చాలా కాలంగా ఆర్థిక కారణాల వల్ల ఈ సినిమా ఆల‌స్య‌మౌతూ వస్తుంది. అయితే ఏది ఏమైనా ఈ దీపావ‌ళి నాటికి మాత్రం ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయాలన్న ఆలోచనలో ఉన్నారు చిత్రబృందం. అయితే ఈ సినిమా టైటిల్‌ కోసం మొదట `బ‌లం` అని అనుకున్నారు. కానీ అదే టైటిల్‌ని పెడదామనుకుంటే... తీరా ఆ టైటిల్ ని హృతిక్ రోష‌న్ సినిమాకు  పెట్టుకున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ న‌టిస్తున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్... ‘కాబిల్‘ చిత్రాన్ని తెలుగులో కూడా విడుద‌ల చేయ‌నున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం తెలుగు టైటిల్ కి ‘బ‌లం’ అని పేరు పెడుతున్నట్లు తెలుస్తుంది.

కాగా జయ్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ బాలీవుడ్ చిత్రం జనవరి 26, 2017 వ తేదీ విడుదల అవబోతుంది.  అయితే ‘బ‌లం’ అనే టైటిల్ ను హృతిక్ రోషన్ తీసేసుకోవ‌డంతో ప్రస్తుతం గోపీచంద్ తన సినిమా కోసం మ‌రో టైటిల్ ను వెతుకుతున్నట్లు తెలుస్తుంది. ఈ దీపావళికి ఫస్ట్ లుక్ విడుదల చేయాలని అనుకుంటున్న ఈ చిత్రం టైటిల్ ను ‘ఆర‌డుగుల బుల్లెట్‌’, ‘బుల్లెట్’  వంటి పేర్లు ప‌రిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంకా గోపీచంద్ సెంటిమెంట్ ప్ర‌కారం సున్నాతో కూడిన టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే న‌య‌న‌తార క‌థానాయిక‌గా వస్తున్న ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ