Advertisementt

కోర్టు మెట్లెక్కిన రెమో..!

Sun 23rd Oct 2016 10:43 PM
remo tamil film,siva karthikeyan,court problems,entartainment tax,tamil nadu  కోర్టు మెట్లెక్కిన రెమో..!
కోర్టు మెట్లెక్కిన రెమో..!
Advertisement
Ads by CJ

శివ కార్తికేయన్ హీరోగా కీర్తి సురేష్ నటించిన తాజా చిత్రం రెమో. ఈ సినిమా అక్టోబర్ 7వ తేదీ తమిళంలో విడుదలైంది. కాగా తెలుగులో నవంబర్ 4వ తేదీ విడుదలకు సిద్ధంగా ఉంది. రెమో చిత్రం తాజాగా ఓ కోర్టు కేసులో ఇరుక్కుంది. అదేంటంటే.. రెమో చిత్రం  వినోదపు పన్ను మినహాయింపుపై  హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేయగా... ఈ విషయంపై ప్రభుత్వం తగిన సమాధానం ఇవ్వాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే తమిళంలోనే టైటిల్స్ ను పెట్టి తమిళ భాషను ప్రోత్సహించినవారికి మాత్రమే అక్కడ వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది.  రెమో అనే పదం లాటిన్ భాషకు చెందినది కాబట్టి, ఈ చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపు ఎలా ఇస్తారన్నది చాలా సమస్యగా మారింది.  కాగా  కోర్టు తాజాగా ఈ విషయంపై స్పందిస్తూ.. నవంబర్ 21వ తేదీకి ఈ కేసు విచారణను వాయిదా వేసింది. ఈ కేసులో ఎటువంటి తేడా వచ్చినా....రెమో నిర్మాతలు భారీస్థాయి నష్టాలను చవిచూసే ప్రమాదం ఉందని అంటున్నారు కోలీవుడ్ విమర్శకులు.

అయితే రెమో చిత్రంలో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది.  తెలుగులో రామ్ తో కలిసి నటించిన ఈ భామ ఆ తర్వాత స్టార్ హీరోలతో ఛాన్స్ కొట్టేసి మంచి క్రేజ్ సంపాదించుకుంది. మరి రెమో చిత్రంలో కూడా కీర్తి సురేష్ అద్భుతంగా నటించిందంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ