Advertisementt

పూర్వవైభవం కోసం ఎదురుచూపులు...!

Sun 23rd Oct 2016 08:21 PM
krishna vamsi,creative director,flop director,balakrishna 101 movie,nakshtram movie  పూర్వవైభవం కోసం ఎదురుచూపులు...!
పూర్వవైభవం కోసం ఎదురుచూపులు...!
Advertisement
Ads by CJ

కృష్ణవంశీ... తెలుగుసినీ చరిత్రలో ఆయనకంటూ ఓ స్దానం ఉంది. క్రియేటివ్‌ జీనియస్‌గా పిలువబడే ఆయన 'గులాబి, నిన్నేపెళ్లాడతా, ఖడ్గం, చందమామ' వంటి చిత్రాలతో వెలుగొందాడు. కానీ ఆయనకు 'ఖడ్గం' తర్వాత మరలా అంతటి ఊపు రాలేదు. 'చందమామ, రాఖీ'చిత్రాలు కేవలం ఫర్వాలేదనిపించాయి. ఇక ఇటీవల ఆయన రామ్‌చరణ్‌తో చేసిన 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం కూడా యావరేజ్‌ దగ్గరే ఆగిపోయింది. దీంతో ఈయనపై క్రియేటివ్‌ జీనియస్‌ అనే బిరుదు పోయి ఫ్లాప్‌ డైరెక్టర్‌ అనే ముద్ర పడింది. కాగా ప్రస్తుతం ఆయన సందీప్‌కిషన్‌, సాయిధరమ్‌తేజ్‌, రెజీనా తదితరులపై 'నక్షత్రం' సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని విభిన్నమైన పబ్లిసిటీ చేయాలని ఆశిస్తున్న కృష్ణవంశీ ఈ చిత్రానికి సంబంధించిన 9లుక్స్‌ను రామ్‌చరణ్‌ చేతుల మీదుగా విడుదల చేయించనున్నాడు. ఇక ఈ చిత్రం తర్వాత కృష్ణవంశీకి మరో పెద్ద ఆఫర్‌ కన్‌ఫర్మ్‌ అయింది. బాలకృష్ణ 101వ చిత్రంగా ఆయన ఓ చిత్రం చేయనున్నాడు. ఈ రెండు చిత్రాలు కృష్ణవంశీ కెరీర్‌కు చాలా కీలకం అని చెప్పాలి. ఆయన మరలా తన పూర్వవైభవం పొందాలంటే 'నక్షత్రం'తో పాటు 'రైతు' చిత్రాలు భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలనే కసితో ఆయన పనిచేస్తున్నాడట. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ