మహేష్ బాబు కెరీర్ మొదలైనప్పటి నుండి చాలా సినిమాలు హీరోగా చేసినప్పటికీ కూడా మహేష్ పూరి డైరెక్షన్ లో చేసిన 'పోకిరి' సినిమాతో అతనికి స్టార్ హీరో అనే హోదా వచ్చింది. ఒక్క సినిమాతోనే మాస్ హీరోగా స్టార్ డమ్ ని సొంతం చేసుకున్నాడు మహేష్. అప్పట్లో 'పోకిరి' సినిమా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టి మహేష్ ని నెంబర్ 1 స్థానం లో నిలబెట్టింది. ఒకే ఒక్క సినిమా మహేష్ జీవితాన్ని మార్చేసింది. ఇక తర్వాత మహేష్ సక్సెస్ బాట పట్టాడు. పూరి కి కూడా స్టార్ డైరెక్టర్ హోదా వచ్చేసింది. పూరి కూడా పెద్ద హీరోలతో బిజీ అయిపోయాడు. మహేష్ కూడా వేరే డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తూ బిజిగా మారాడు. ఇక పూరి - మహేష్ కాంబినేషన్ లో 'బిజినెస్ మాన్' సినిమా తెరకెక్కి హిట్ అయ్యింది. అయితే పూరి మళ్ళీ మహేష్ తో 'జనగణమన' సినిమా తీద్దామని స్టోరీ తో మహేష్ ని కలిశాడట. ఈ స్టోరీ ని విన్న మహేష్ ఎస్ గానీ, నో గాని చెప్పకుండా పూరీని హోల్డ్ లో పెట్టాడట. అయితే వీరి కాంబినేషన్ లో 'జనగణమన' వుంటుందనే ప్రచారం ఊపందుకుంది. ఫైనల్ గా పూరి నాకు మహేష్ నో గానీ, ఎస్ గానీ చెప్పలేదు.. నన్ను ఇన్ని రోజులు వెయిట్ చేయించాడు... ఇలా వెయిట్ చెయ్యడం నాకిష్టం ఉండదు... ఏదో ఒకటి చెబితే బావుండేదని మహేష్ మీద సంచలన వ్యాఖ్యలు చేసాడు. మరి 'పోకిరి'తో మహేష్ ని స్టార్ హీరో గా చేసిన పూరి తో మహేష్ ఇలా ప్రవర్తించడం కరక్టేనంటారా? ఇదిలా ఉండగా ఎన్టీఆర్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద స్పందించిన పూరి అనౌన్సమెంట్ వచ్చేవరకు చెప్పలేనని క్లియర్ చేసేసాడు. అంటే 'జనగణమన' ఎవరితో తీస్తాడనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.